30.7 C
Hyderabad
April 29, 2024 05: 15 AM
Slider నల్గొండ

హుజుర్ నగర్ మండలాన్ని కరోనా రహితంగా మారుద్దాం

#HujurnagarMPP

ప్రపంచాన్ని  అతలాకుతలం చేసిన, చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని రూపుమాపేందుకు టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమని హుజుర్ నగర్ MPP  గూడెపు  శ్రీనివాస్ అన్నారు.

కరోనా నివారణకు టీకాను కనిపెట్టి భారతదేశం ఈ రోజున ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని టీకాపై భయాలను పారదోలేందుకు వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని MPP కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిద్ టాస్క్ ఫోర్స్ సమావేశానికి శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన పెంచేందుకు ఐదువేల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడంతో పాటు హుజూర్ నగర్ మండల వ్యాప్తంగా కోవిడ్ రహిత మండలంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అవగాహనా కొరకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. సమావేశం అనంతరం కరోనా వైరస్ పై అవగాహనా కల్పిచటం కొరకు కరపత్రం విడుదల చేసిన అనంతరం శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్ నందు  టీకా వేయించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి  Dr. లక్ష్మణ్ గౌడ్, ఎంపీడీఓ వరప్రసాద్,తహసీల్దార్ జయశ్రీ, ఎంపీ ఈ ఓ.మౌలాన, ఎంపీటీసీ  వెంకటేశ్వర్లు,  గ్రామ సర్పంచ్ లు   శిరీష కొండారెడ్డి, నాగ సైదయ్య,సుజాత,సైదేశ్వర రావు, దుగ్గి గురువర్మ,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ సంస్థల్ని కాపాడాలి

Satyam NEWS

సీఏఏ కాదు, పాక్ చర్యలను వ్యతిరేకించండి

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా లో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS

Leave a Comment