40.2 C
Hyderabad
April 26, 2024 14: 08 PM
Slider ఖమ్మం

ముమ్మరంగా కొనసాగుతున్న RTC ఉద్యోగుల కోవిడ్ వాక్సినేషన్

#CoronaVaccine

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగి కోవిడ్ వాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా టీకా వేయడం లాంఛనంగా ప్రారంభించామని మంత్రి తెలిపారు.

ఇప్పటికే దాదాపు అన్ని కేంద్రాల్లో విజయంతంగా వాక్సిన్ వేస్తున్నారని, 4 రోజుల పాటు నిర్విరామంగా అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వాక్సిన్ వేసుకునేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం 35 కేంద్రాల్లో వాక్సినేషన్ సిద్ధంగా ఉందని, అన్ని డిపోల డ్రైవర్లు, కాండక్టర్లకు సిబ్బందికి కవిడ్ వాక్సినేషన్ దగ్గరుండి వేయించే విధంగా RM చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుండటంతో ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్టిసి RM & DM లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, DM&HO మాలతి, RTC RM సోల్మొన్, వైద్య, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అనంత లోకాలకు మార్గాలు… అనకాపల్లి రహదారులు!

Satyam NEWS

టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

Satyam NEWS

వైభవంగా జంగమ గురుదేవర పూజ

Bhavani

Leave a Comment