29.7 C
Hyderabad
April 29, 2024 08: 05 AM
Slider హైదరాబాద్

కోర్టుల చుట్టూ తిరుగుతున్న విద్యార్ధి నాయకులు

student leaders

నీళ్లు, నిధులు, నియామకాల కొరకు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించిన నిరుద్యోగులు వారు. వారు చేసిన ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఇక మన కష్టాలు తీరినట్లేనని భావించారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కొలువులు దొరకడం లేదు. దాంతో వారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతం తీరుగనే వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. నిరుద్యోగులు తమ డిమాండ్ ను పబ్లిక్ గా చెప్పడం పాలకులకు నచ్చలేదు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కేసులు పెట్టారు.

సొంత రాష్ట్రమైన తెలంగాణ లో వారికి ఉద్యోగాలు రావడం మాట అటుంచి కేసుల్లో ఇరుక్కున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ విద్యార్థులు ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టు చేసి కోర్టు చుట్టు తిప్పుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఈ రోజు నాంపల్లి  lV- చిప్ మెజిస్టేట్ ముందు హాజరు అయ్యారు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్, అధ్యక్షులు శ్రీకాంత్, విజయ్, కళ్యాణ్ నాయక్, ఈశ్వర్, నాగరాజు తదితరులు.

Related posts

మండలి వైస్ ఛైర్మన్ కు  ఎంపీ వద్దిరాజు అభినందన

Satyam NEWS

వేధింపులు భరించలేక అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

హుజూర్ నగర్ లో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment