40.2 C
Hyderabad
April 29, 2024 17: 37 PM
Slider గుంటూరు

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

#kharifplan

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా ఖరీఫ్ విత్తన ప్రణాళికను ప్రకటించారు. జిల్లాలో ప్రత్తి, మిరప విత్తన కంపెనీల ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్స్ తో కలిపి సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారుల తో నేడు సమావేశం నిర్వహించారు.

పల్నాడు జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం  347,000 114 హెక్టార్లు. జిల్లాలో ఖరీఫ్ లో ప్రధానంగా వాణిజ్య పంటలు అయిన ప్రత్తి సాధారణ విస్తీర్ణం 130025 హెకార్లు కాగా 14550 హెక్టార్లు సాగు కావొచ్చని అంచనా. అదే విధంగా మిరప పంట సాధారణ విస్తీర్ణం57841 హెక్టార్లకు గాను 77560 హెక్టార్లు సాగు కావచ్చునని అంచనా వేస్తున్నారు.

వీటితో పాటు వరి, కంది పంటలకు కావలసిన నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాగు విస్తీర్ణంలో సాగు చేసే పంటలకు కావలసిన విత్తనాల పరిమాణాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా ఆయా కంపెనీలు విత్తనాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఈ విత్తనాలు ప్రతి రైతు భరోసా కేంద్రం లో అందుబాటులో ఉండాలి. ప్రతి మండలంలో ఏ ఏ విత్తనాలు ఎంత పరిమాణంలో అవసరమో ఆ రకాలను ముందుగా అందించవలసినదిగా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖలు పంచాయతీ రాజ్, రెవిన్యూ , పోలీస్ వారి సమన్వయంతో విజిలెన్స్ కమిటీ వేసి రైతుకు అనధికార వ్యవసాయ ఉత్పత్తులపై నిఘా వేయటం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ సమావేశంలో అన్ని విత్తన కంపెనీల సప్లై గమనించి మండలాల వారీగా తగినంత విత్తనాలను సకాలంలో సరఫరా చేయమని ఆదేశించారు. పల్నాడులోని డిస్ట్రిబ్యూటర్స్ అందరిని జిల్లా కు కావలసిన విత్తన రకాలను జిల్లాలోనే అమ్మ వలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లాలోని అన్ని డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు, 28 మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

యువత ధైర్యంతో ముందడుగు వేస్తే విజయం సొంతమౌతుంది

Satyam NEWS

అంగరంగ వైభవంగా మల్లన్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

రాజకీయ దాహం ఇంకా తీరలేదా? ఏమిటీ వలసలు?

Satyam NEWS

Leave a Comment