28.7 C
Hyderabad
April 27, 2024 03: 51 AM
Slider మహబూబ్ నగర్

చిన్నంబాయిలో కోర్టు ఏర్పాటు చేయాలని వినతి

#chinnambavi

వనపర్తి జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్న పానగల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల కక్షిదారులకు అందుబాటులో కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, సాంబశివ రావు నాయుడు లకు గూడెం గ్రామ సర్పంచ్, హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తి వినతిపత్రం సమర్పించారు. కొల్లాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

చిన్నంబాయి మండలం గూడెం గ్రామ సర్పంచ్, హైకోర్టు అడ్వకేట్ చక్రవర్తి చిన్నంబావి మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కోర్టు ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే కొల్లాపూర్ బార్ అసోసియేషన్ తీర్మానం మేరకు చిన్నంబావిలో కోర్ట్ ఏర్పాటు చేయాలని పలుమార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించారని తెలిపారు.

మూడు మండలాల పరిధిలో సుమారు 80 వేల మందికి అందుబాటులో ఉండేలా చిన్నంబావిలో కోర్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉపేందర్, ఏజిపి వసంత రెడ్డి, భుజాల భాస్కర్ రెడ్డి, శివారెడ్డి, గోవిందు ,శ్రీనివాసరావు, రాజేష్, నిరంజన్, రామలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత సాధికారికతకు ప్రతీక రిపబ్లిక్ డే!

Satyam NEWS

ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రద్దు

Satyam NEWS

వై ఎస్ షర్మిల గారూ ఆంధ్రా బిడ్డగా ఒక సారి మమ్మల్ని చూడండి

Satyam NEWS

Leave a Comment