38.2 C
Hyderabad
April 29, 2024 12: 59 PM
Slider విశాఖపట్నం

రూ.1.25 కోట్లతో వైజాగ్ లో కోవిడ్-19 పరీక్ష కేంద్రం

vizag covid

విశాఖపట్నంలో కోవిడ్-19 పరీక్ష కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం కె.జి.హెచ్.లోని రాదేంద్ర ప్రసాద్ వార్డు వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్-19 పరీక్షా కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ వచ్చిన రోగుల కోవిడ్-19 పరీక్షలకు శ్యాంపిల్స్  తీసి తిరుపతికి పంపడమైనదని, తరువాత కాకినాడ పంపేవారమని ఆయన తెలిపారు. ఇపుడు విశాఖపట్నంలోనే కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రికి కోవిడ్-19 పరీక్ష కేంద్రం అడిగిన వారం రోజుల్లోనే ఒక కోటి 25 లక్షల రూపాయలతో మంజూరు చేశారన్నారు. కె.జి.హెచ్.లోనే కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోనే ఉంటుందని, వైద్యులు అందుబాటులోనే ఉంటారని చెప్పారు. 

రాబోయే రెండు వారాలు చాలా ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్ పై ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. అల్లిపురంలో మొదట పాజిటివ్ కేసుకు వయసు ఎక్కువైనా సరియైన సమయంలో రావడం వలన ఆయనకు వైద్యులు మంచి ట్రీట్ మెంట్ అందించడం వలన ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ కె.జి.హెచ్.లో రూ.1.25 కోట్ల రూపాయలతో కోవిడ్ -19 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడమైనదన్నారు.  ఈ పరీక్షా కేంద్రంలో ఒక రోజుకు 60 కోవిడ్ -19 పరీక్షలు చేస్తామని  చెప్పారు.  ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు 19 వరకు ఉన్నారని, వీరు నేరుగా ప్రార్థనలో పాల్గొన్నారని తెలిపారు.

వారి నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపగా ఇందులో 5 పాజిటివ్ వచ్చాయని, 9 నెగిటివ్ వచ్చాయని, మిగిలినవి 5 రిపోర్టులు రావలసి ఉందన్నారు. వారితో రవాణాలో ఉన్నవారు, అనుమానం ఉన్నవారిని 28 వరకు గుర్తించామని, ఇందులో 23 మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపామన్నారు.

5గురు  వచ్చి సబ్సీక్వెంట్ గా వెనక్కు మన జిల్లా నుండి వెల్లిపోయారని ఆయన వివరించారు.  23 మంది ఆసుపత్రిలోనే ఉన్నారని చెప్పారు.  ఆసుపత్రిలో ఉన్న వారికి మంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి.ఎ. అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇంకా కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. జి. అర్జున, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, ఉప పర్యవేక్షకులు డా. కె. ఇందిరాదేవి, వైరాలజి ల్యాబ్ ఇన్ చార్జ్ డా. కమల, డా. మంజుల, ఆర్ఎంఓలు డా. ఎం విజయ శంకర్, డా. సి.హెచ్. సాధన తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీలో మఠంపల్లి మండల కొత్త తండ వాసి

Satyam NEWS

కాపిటల్ ఇష్యూ: ఏమాత్రం స్పందన లేని రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

వీసీసీ ఛాంపియనషిప్ అర్హత సాధించిన వెలాసిటీ గేమింగ్

Satyam NEWS

Leave a Comment