అమరావతిలో రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావడంలేదు. ప్రభుత్వం అసలు ఎక్కడా నిరసనలు జరగుతున్నట్లుగానే గుర్తించడం లేదు. ఇది రాజధాని రైతులను మరింతగా బాధిస్తున్నది. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
దాంతో రాజధానిలో రైతుల ఆందోళనలు యధావిధిగా కొనసాగుతున్నాయి. పలు రూపాల్లో నిరసన తెలియచేస్తున్న రైతులు, మహిళలు నేడు వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. తుళ్ళూరు నుంచి ట్రాక్టర్లు, బైక్ లతో పాటు ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేయనున్నారు. రాజధాని గ్రామలతో పాటుగా ఇతర ప్రాంతాల వరకు సైతం భారీగా తరలి రావాలని ఇప్పటికే జేఏసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.