39.2 C
Hyderabad
May 3, 2024 12: 57 PM
Slider నల్గొండ

ప్రజల రక్షణ గాలికి వదిలి మద్యం షాపులు తెరుస్తారా?

#CPI Huzurnagar

కరోనా కష్ట సమయంలోఎవరు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులను తెరిచిందో స్పష్టం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రజల భద్రతను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం దురదృష్టకరమని అన్నారు.

ఈ మేరకు నేడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆబ్కారీ  సి ఐ కి భారత జాతీయ మహిళా సమాఖ్య మెమెరాండం సమర్పించింది. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకురాలు సృజన మాట్లాడుతూ ఇప్పటికైనా మద్యం నియంత్రించాలని డిమాండ్ చేశారు.

కరోనా ప్రబలుతున్నందున ప్రజలు సురక్షితంగా ఉండవలసిన సమయంలో మద్యం షాపులు తెరవడం అన్యాయమని వార్నారు. మొదటి  రెండు లాక్ డౌన్ సమయాలలో మద్యం లేకపోవటంవల్ల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయని ఈ మద్యం షాపులు తెరవడంతో మరల పేద కుటుంబాలలో కల్లోలం మొదలైందని అన్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు ఆగమైపోతున్నాయని అన్నారు.

మద్యం అమ్మకాల వలన వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా ప్రభుత్వం చూడటం సరికాదని మద్యం దశలవారీగా నియంత్రిస్తూ పూర్తిగా నిషేధించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవారం మల్లేశ్వరి, సోమగాని జానకి,సిగినల  పుల్లమ్మ, వీరమ్మ,చింతకుంట్ల విజయ, సోమ గాని మీనా, రామనర్సమ్మ, జాన్ భీ, వడ్లానపు రమణ, జక్కుల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెళ్లి పేరుతో డాక్టర్ ను కూడా మోసం చేసిన ఘనుడు

Satyam NEWS

కడప జిల్లాలో ఏటీఎం ల దొంగ అరెస్ట్

Satyam NEWS

పోలీస్ డైరీ: ఈ రంజాన్ ఖాసిం కు ఆకలి లేని పండుగ కావాలి

Satyam NEWS

Leave a Comment