29.7 C
Hyderabad
April 29, 2024 10: 30 AM
Slider విజయనగరం

పోక్సో కేసులపై దృష్టి పెట్టండి…!

#police

విజయనగరం జిల్లా నేర సమీక్ష సమావేశం లో పోలీసు ఎస్ పి దీపిక

ప్రతి నెలాఖరు లో నేర సమీక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పోలీసు ఎస్ పి దీపిక బ్యేరక్స్ లోని కాన్ఫరెన్స్ హాలులో డీసీఆర్సీ నిర్వహించారు. ఇటీవలే బ్యారెక్స్ లో జరిగిన ఆర్మీ రిక్రూట్ మెంట్ లోని ,అలాగే ఏఆర్, టూటౌన్,ట్రాఫిక్, రూరల్ పోలీసు స్టేషన్ లకు చెందిన షేక్ శంకర్,  రాజు ,రామకృష్ణ ఇతర సిబ్బంది ని….నేర సమీక్ష సమావేశం లో ఉన్నతాధికారుల ముందే…సంబంధిత స్టేషన్ ఎస్ఐ ,కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ దీపికా ప్రశంసా పత్రాలను ఇచ్చి అభినందించడం విశేషం.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలుపడే విధంగా దర్యాప్తు చేయాలని, సాంకేతిక ఆధారాలను, సాక్షాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. పోక్సో కేసుల్లో దర్యాప్తును క్షుణ్ణంగా చేయాలని, అవసరమైన కేసుల్లో బాధితులకు కౌన్సిలింగు నిర్వహించాలన్నారు. వివిధ పోలీసు స్టేషనుల్లో రౌడీ షీటర్లుపై నమోదైన కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆయా కేసులను ప్రాధాన్యత కేసుల జాబితాల్లో చేర్చి, నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లుకు న్యాయస్థానాల్లో శిక్షలు పడే విధంగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు చేపట్టాని, ఎం.వి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు విధించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వైట్ కాలర్ నేరాలైన చీటింగు, నమ్మకద్రోహం కేసుల్లో దర్యాప్తు కుణ్ణంగా చేపట్టాలని, మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

దొంగతనాలు జరగకుండా రాత్రి పెట్రోలింగు, గస్తీని ముమ్మరం చేయాలని, ఎ.టి.ఎం. కేంద్రాలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. దివాళీ పండగ వస్తున్న నేపథ్యంలో మందుగుండు విక్రయించే వ్యాపారులను నిబంధనలు పాటించే విధంగా బైండోవరు చేయాలని, అక్రమ మందుగుండు విక్రయ, తయారీదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత దర్యాప్తు అధికారులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక దిశా నిర్దేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

రాష్ట్ర సీఎం పర్యటనలో భద్రత విధులను సమర్ధవంతంగా నిర్వహించిన టూటౌన్ సిఐ ఎన్.హెచ్. విజయ ఆనంద్, ఎస్ఐ షేక్ శంకర్, రాజాం చోరీ కేసును చేధించుటలో సమర్ధవంతంగా పని చేసిన రాజాం ఎస్ఐ వై. రవికిరణ్, అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సులో ప్రయాణికులను సకాలంలో స్పందించి రక్షించిన ట్రాఫిక్ ఎస్ఐ ఎ.ఎం. రాజు, హెచ్.జి. సీహెచ్.వెంకటరావు, అగ్నివీర్ బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించిన ఆర్.ఎస్.ఐ. ఎ.రామకృష్ణ, వివిధ కేసులను చేధించుటలోను, వివిధ పోలీసు విధులను సమర్ధవతంగా నిర్వహించిన టూటౌన్ హెచ్.సి. టి.వి.ఆర్.కే.వి.ప్రసాద్,

కానిస్టేబుళ్ళు ఎం. వాసు, ఎం.గణేష్, బొబ్బిలి కానిస్టేబుళ్ళు జి. శశిభూషణరావు, పి.లక్ష్మణరావు, తెర్లాం కానిస్టేబుల్ ఎస్.ఢిల్లీశ్వరరావు, గజపతినగరం కానిస్టేబుళ్ళు పి. సత్యన్నారాయణ, ఎస్. శ్రీహరి, ఎస్బీ కానిస్టేబుల్ జె.జయకృష్ణ, రాజాం కానిస్టేబుళ్ళు ఎస్. సత్యంనాయుడు, కే. సూరపు నాయుడు, హెచ్.జి. కే. రాజేంద్ర లను ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, సెబ్ అదనపు ఎస్పీ ఎస్.వెంకటరావు, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ పి. శ్రీధర్, ట్రాఫిక్ డీఎస్పీ డి. విశ్వనాధ్, న్యాయ సలహాదారులు వై.పరశురాం,

డిసిఆర్బి సీఐ జె.మురళి, ఎస్బీ సీఐలు కే.కే.వి. విజయనాధ్, ఈ. నర్సింహమూర్తి,వన్ టౌన్ సీఐ డా. బి. వెంకటరావు, టూటౌన్ సీఐ విజయ ఆనంద్, రూరల్ సీఐ టి.వి. తిరుపతిరావు, దిశ సీఐ బి. నాగేశ్వరరావు, రాజాం రూరల్ సీఐ ఎస్.శ్రీనివాస్, గజపతినగరం సీఐ ఎల్. అప్పలనాయుడు, సీసీఎస్ ఎం. బుచ్చిరాజు, బొబ్బిలి రూరల్ సీఐ ఎస్.తిరుమల రావు, భోగాపురం సిఐ వెంకటేశ్వరరావు, కంట్రోల్ రూం సిఐ రాజశేఖర్, ఎస్.కోట సిఐ బాల సూర్యారావు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అక్బరుద్దీన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలి

Satyam NEWS

కరుడుగట్టిన మనస్సు సీఎం జగన్ ది

Bhavani

ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్‌కు క్యాబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌

Satyam NEWS

Leave a Comment