38.2 C
Hyderabad
April 29, 2024 21: 41 PM
Slider విజయనగరం

అక్టోబర్ కు 1.50 లక్షల టిడ్కో గృహ ప్రవేశాలు

#TIDCO

ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లక్ష 50వేల టిడ్కో గృహాలలో లబ్ధిదారుల గృహప్రవేశం జరగబోతున్నది. ఈ దిశగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సారిపల్లిలో అంగరంగ వైభవంగా జరిగిన 480 టిడ్కో గృహ ప్రవేశాల డాకుమెంట్స్ పంపిణి పండుగలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ ముందుగా కోలగట్ల వీరభద్రస్వామిని పుష్పగుచ్చంతో సత్కరించారు. కోలగట్ల వీరభద్రస్వామి లబ్ధిదారులకు ఇంటి యాజమాన్య పత్రాలను, ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికే 72 వేల గృహాలు అందించామని తెలిపారు. అక్టోబర్ 2023 నాటికి ప్రభుత్వం నిర్దేశించిన ఒక లక్షా యాభై వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమము చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ రోజువారీ జీవనం కోసం అవసరమైన సరుకులు కొనుగోలు, రవాణా సౌకర్యం కావాలని కోరారు. లబ్దిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ నరసింహ మూర్తి, అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాద రావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముత్యులయ, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, మెప్మా ప్రోజెక్ట్ డైరెక్టర్ సుధాకర్,  డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ వారి సిబ్బంది, టి.పి.ఆర్. ఓ.చలం, సి.ఎల్.టి.సి శ్రీనివాస రావు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ వారి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

టీడీపీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టం

Satyam NEWS

తాజ్‌మహల్‌ను తాకిన యమన

Bhavani

ఎలక్షన్ కోడ్ వచ్చినా కార్యాలయాన్ని ఖాళీ చేయని మంత్రి

Satyam NEWS

Leave a Comment