38.2 C
Hyderabad
April 29, 2024 12: 21 PM
Slider హైదరాబాద్

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టంపై అవగాహన

#cybarabadpolice

మాదకద్రవ్యాల సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబారాబాద్ సీపీ ఎం స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లతో సీపీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ NDPS act 1985 (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్) పై సిబ్బంది మరింత అవగాహన అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా మాదకద్రవ్యాల కేసులపై సమీక్షించారు. డ్రగ్స్ నెట్వర్క్,  డ్రగ్స్ సరఫరా, వినియోగం పై ప్రస్తుత పోకడలపై చర్చించారు. భవిష్యత్తు ప్రణాళికలు, కార్యాచరణను వివరించారు.

ఇటీవల కాలంలో యువత డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించి దృష్టి సారించాలన్నారు. సప్లయర్స్ చైన్ ను బ్రేక్ చేస్తే మత్తులో జరిగే నేరాలను అడ్డు కట్ట వేసే అవకాశం ఉందన్నారు. 

డ్రగ్ అడిక్టర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావలాన్నారు. మాదకద్రవ్యాల స్మగ్లర్లు, వినియోగదారుల వివరాలు సేకరించి కేసులు నమోదు చేసి నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చేయాలన్నారు. తరచుగా పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు.

ఈ సమావేశంలో శంషాబాద్ డిసిపి ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపిఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ ఎం విజయ్ కుమార్, క్రైమ్స్ డిసిపి రోహిణీ ప్రియదర్శినీ, బాలానగర్ డిసిపి పీవీ పద్మజా, మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డిసిపి సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ ఉగ్రవాదిగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ

Bhavani

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు మూత

Satyam NEWS

వనపర్తి డిఎస్ పి కార్యాలయానికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment