31.2 C
Hyderabad
May 3, 2024 00: 05 AM
Slider రంగారెడ్డి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సైబరాబాద్ సీపీ

#mamata

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనాలు జరిగే చెరువులను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో బాటు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎం విజయ్ కుమార్, కూకట్ పల్లి  జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ మమత, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ తదితర అధికారులతో కలిసి సిబ్బందికి సూచనలు చేశారు. కూకట్ పల్లి పరిధిలోని ఐడీఎల్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయాలి. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. నిమజ్జనానికి వచ్చే వారితో సిబ్బంది, పోలీసులు మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించి తగు సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపునకు ఆటంకంగా ఉంటే చెట్లను తొలగించడంతో పాటు పలు మార్గాలలో లైట్లను ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట వద్ద విద్యుత్‌ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని భక్తుల సౌకర్యార్థం మంచి నీటి సౌకర్యం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయలన్నారు. అలాగే రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చూడాలన్నారు. నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్ళింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాల కారణంగా గణేశ్ నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయం తో పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి ఎమ్ వెంకటేశ్వర్లు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, కూకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ డీఈ శ్రీదేవి,  , అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శివ కుమార్, కూకట్పల్లి ఇన్ స్పెక్టర్ నర్సింగ్,  రావు, కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ బొసే కిరణ్, హెచ్ఎండబ్లూఎస్ వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్,  జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ఎన్ డెపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు.

Related posts

జనగామ లో ఘనంగా వైఎస్ జయంతి

Satyam NEWS

దళిత బంధు మాకొద్దు 3 ఎకరాల భూమి ఇవ్వండి…

Satyam NEWS

15 నుండి 18 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

Satyam NEWS

Leave a Comment