33.7 C
Hyderabad
April 30, 2024 01: 34 AM
Slider ప్రత్యేకం

నిజమైన దళితుల పట్ల ఏ మాత్రం కనికరం లేని కొల్లాపూర్ నేతలు

#kollapur

దళిత బంధు… చాలా గొప్ప పథకం…. ఎప్పుడు? సరిగా అమలు జరిగితే… అయితే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరుగుతున్న తంతు వేరు. నిజమైన పేద దళితులను ఈ పథకానికి ఎంపిక చేయకుండా కేవలం తమ వారికి మాత్రమే ఈ పథకం అందేలా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజక వర్గంలో  ఆర్థికంగా వెనుకబాటుకు గురైన దళితులను దళిత బంధు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం వుందని అందుకోసమే దళిత బంధు తీసుకోచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

కానీ పొద్దున లేస్తే భజన చేసే బ్యాచ్ కి, అక్కడ ఇక్కడ జిందాబాద్ లు పలికే వారికి మాత్రమే దళిత అందిస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల భర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ వైస్ ఎంపీపీలు, మాజీ డైరెక్టర్లు మాత్రమే ఇందులో దళిత బంధువులు అయ్యారు. అంటే సామాన్యుల పరిస్థితి నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొద్దున లేస్తే రంగులు పూసుకుని కనిపించే మొఖాలను  గుట్టుచప్పుడు కాకుండా ఎంపిక  చేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారి ఇంటికి కూడా దళిత బంధువు ఎంపిక చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. లిస్టు లో పేర్లు కూడా కనిపిస్తున్నాయనీ అంటున్నారు.

ఇలా ఎంపిక  చేసిన ఆ నేతకు  అసలుకు  మానవత్వం వుందా? అనేదే ప్రశ్న. మానవత్వం వుంటే నిజమైన అర్హులను ఎంపిక చేస్తారు. కానీ ఇలా జరగలేదు. వేలాది  మంది ఓట్లేస్తేనే ప్రజా ప్రతినిధి అయ్యిండు. ఎవరు నిరుపేదలు? ఎవరు ధనవంతులు అనేది తెలియదా? ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనేది తెలియదా? ఇవన్నీ తెలిస్తే మానవత్వం కలిగిన నాయకులు అవుతుండే. కనీసం ప్రకటన లేకుండా  ఈ వ్యవహారానికి పాల్పడ్డారు అంటే ఎంతవరకు మానవత్వాన్ని చాటుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

భూమి వున్న వారు రైతు బంధువులు అయ్యారు.రా జకీయ పలుకుబడి వున్న వారు కార్పొరేషన్ లోన్ల, సబ్సిడీ ట్రాక్టర్ల బంధువులు అయ్యారు. మళ్ళీ వారే పొద్దున లేస్తే ముందుకు వచ్చి  మొఖాలు చూయించే అన్ని వున్న  వారు,జై భీమ్ అన లేని వారు, ఆ విలువ తెలియని వారు కూడా దళిత బంధువులు అయ్యారు. నియోజకవర్గంలో ఇలాంటి మార్పు మాత్రం కోరుకోలేదనీ ప్రజలు అంటున్నారు.

మానవత్వం కలిగిన నాయకులు అయితే ఆలోచనలో, తీసుకునే నిర్ణయాలలో మార్పులు ఉంటుండే అని కొందరు అంటున్నారు. కూడు, గూడు సక్రమంగా లేనివారు ఎంత మంది లేరు.? ఉన్నత చదువులు చదివి బెల్టుషాపులు పెట్టుకొని బతుకుతున్నా వారు కూడా ఉన్నారు. అందుకే లబ్ధి దారుల ఎంపిక జిల్లా కలెక్టర్ల పరిధిలో  జరగాలి. అప్పుడే నిజమైన అర్హులు ఎంపిక అవుతారు. న్యాయం జరుగుతుందని ప్రతిపక్షాల పార్టీల నాయకులు,వివిధ సంఘాల నాయకులు ఆర్డీఓ లకు, తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇక్కడ టీఎర్ఎస్ పార్టీ  పై కూడా సర్వేలలో వ్యతిరేకత వుందని సర్వేలు చెబుతున్నాయి. మరి జాగ్రత్త పడతారో, ఇలాగే వదిలేస్తారో చూడాలి.

Related posts

దేశ సమస్యల పరిష్కారంలో మనం ముందుండాలి

Satyam NEWS

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు హైకోర్టు ఆదేశాలు

Satyam NEWS

గ్రీన్ ఫెస్టివల్: పండుగలా ప్రారంభమైన హరితహారం

Satyam NEWS

Leave a Comment