38.2 C
Hyderabad
April 28, 2024 20: 52 PM
Slider ముఖ్యంశాలు

రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కు చెప్పుల దండ

#kollapur

భారత రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో తిరగనీవ్వమని సీఎం కేసీఆర్ కు కొల్లాపూర్  మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్ చిత్రపటాలకు చెప్పుల దండ వేసి, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. కెసిఆర్  మనువాదాంతో  కూడిన అహంకారంతో రాజ్యాంగాన్ని అవమానపరిచరాన్నారు.

సమానత్వ స్థానంలో అసమాన సమాజాన్ని నిర్మించడం కోసం  నిర్మించుకోవడం కొరకై కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. అంబేద్కర్ అంటేనే సామాజికన్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణ, పేదవాడి ఇంట్లో వెలిగే దీపం అని రాజ్యాంగాన్ని వ్రాసిన అంబేద్కర్ ను కొనియాడారు. అలాంటి మహనీయుడు అందించిన రాజ్యాంగాన్ని కెసిఆర్ దొర అహంకారంతో అవమాన పరిచారన్నారు. పేదలు  బాగుపడితే జీర్ణించుకోలేని వ్యక్తి కేసీఆర్  అని అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి నిరోధకుడు కేసీఆర్ అని వారన్నారు.కేసీఅర్ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భం లేదన్నారు.

రాజ్యాంగం ద్వారా కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యాడనే  అంశాన్ని  మరచి పోవద్దన్నారు. తక్షణమే బేషరతుగా భారత రాజ్యాంగానికి  క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో కేసీఆర్ ను తిరగనివ్వం  వెంటాడుతాం బిడ్డ కెసీఆర్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యం ఎస్పి, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ ఎఫ్ నాయకులు సంపంగి మద్దిలేటి, పుట్ట పోగ రాము, మంద నరసింహ, వడ్డెమాన్ రాములు, రాము,దళిత సంఘం నేత శివానందం, ఎద్దుల రాముడు, మీసాల నాగరాజు, రామకృష్ణ, పరమేష్, రమేష్, గిరి, సంపంగి నరసింహ, వంశీ, సురేష్, కార్తీక్, మహేష్, యుగేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: డిఎస్పీ డిమాండ్

భారత రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కొల్లాపూర్ డీఎస్పీ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ ఫోటోల ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే మాటలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు కు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు రాము మహారాజ్,  ప్రధాన కార్యదర్శి రఘు మహారాజు, రాజారామ్ మహారాజ్, వెంకటేష్ మహారాజ్, వెంకటయ్య మహారాజ్, సురేష్ మహారాజ్, బాలు మహారాజ్, వంశీ మహారాజ్, సురేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని అవమానించిన కెసిఆర్ కు బుద్ధి చెబుతాం..

ఒక వైపు భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు  కొనియాడుతూ ముందుకు  సాగుతున్నారని కొల్లాపూర్ దళిత, బహుజన సంఘాల నాయకులు అన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన కులాలహక్కులను హరించే విధంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ కండ్ల కావడంతో భారత  రాజ్యాంగాన్ని అవమానించరాన్నారు.ఈ సందర్భంగా కెసిఆర్  ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

కేసీఅర్ సబ్బండ కులాల ఆగ్రహానికి గురికాక తప్పదని రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు.గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు కేసీఅర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. సిఎం కేసీఅర్ పై  మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్,తెలంగాణ దళిత దండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు, అవుట ఎర్ర శ్రీనివాసులు, బిజ్జ సురేందర్, సందీప్ తదితరులు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పరిష్కారం చూపకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు  రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం అన్నారు. ప్రజలు  సీఎం కుర్చీని గుంజుకొని ఫామ్ హౌస్ కు పంపడం ఖాయమన్ని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

“బ్యాక్ డోర్” టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్

Satyam NEWS

ఈ నాయకులు సమ్మెను సక్సెస్ చేయగలరా?

Satyam NEWS

త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు

Satyam NEWS

Leave a Comment