గ్రూపు డ్యాన్స్,వంటల పోటీలు,తెలుగు పద్యాల పోటీలు
రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవ్- 2021 పేరిట యూత్ సర్వీస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షులువి ఎస్ కిరణ్ కుమార్ కార్యదర్శి గొడవర్తి జగదీష్ బాబు యూత్ సర్వీస్ చైర్మన్ సాయి మనోజ్ కల్లా యూత్ సర్వీస్ డైరెక్టర్ భాను జగన్నాథం యూత్ సర్వీస్ కో చైర్మన్ ఆర్ శంకర్ రెడ్డి లు జిల్లా కేంద్రంలోని ఎస్బీఎన్ లేక్ ప్యాలెస్ లో జరిగిన మీడియా సమావేశంలోమాట్లాడారు..
నవతరోత్సవ్ లో భాగంగా ఈ 24వ న కాంప్లెక్స్ పక్కనే ఉన్న మేసానిక్ టెంపుల్ లో ప్రారంభోత్సవం కార్యక్రమంతో పాటు గ్రూప్ డాన్స్ కాంపిటీషన్, నిర్విహించబడుతోందన్నారు.అలాగే ఆ మర్నాడు.25వ ఎస్ వి ఎన్ హోటల్ నందు మహిళలకు వంటల పోటీలు,అదేరోజు సాయంత్రం అక్కడే 6 7 మరియు 8 9 10 తరగతులు మరియు ఇంటర్ డిగ్రీ కాలేజీ వారికిమూడు గ్రూప్స్ వారికి తెలుగు పద్యాల పాఠనా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అలాగే 26వ న వాయిస్ ఆఫ్ విజయనగరం, 28వ తేదీ ఉదయం 6 గంటలకు సైక్లింగ్ ఎనిమిది గంటలకు ఇండోర్ స్టేడియం నందు షటిల్ బ్యాడ్మింటన్ సాయంత్రం నాలుగు గంటలకు బ్రైడ్స్ ఆఫ్ ఇండియా (భారతీయ పెండ్లి కుమార్తెలు)పోటీలు కార్యక్రమం ఉంటాయన్నారు.
ఇక 29వ తేదీ మెకానిక్ టెంపుల్ నందు స్పాట్ పెయింటింగ్,30వ తేదీన సైన్స్ ఫైర్,అక్టోబర్ 2వ చదువు లో వెనుక బడిన విద్యార్థులు కి తిరిగి చదువులో రాణించడం కి మొటివాషనల్ సెమినార్, అక్టోబర్ 3వ తేదీన జేఎన్టీయూ కాలేజ్ నందు క్రికెట్ పోటీలు నిర్వహించబడతాయన్నారు.
ఇక ఆఖరి రోజు అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం ఎస్బీఎన్ లేక్ ప్యాలస్ నందు ముగింపు కార్యక్రమం తో పాటు పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం జరుగుతుందని నిర్వాహకులు కిరణ్ తెలిపారు.