మేడ్చల్ జిల్లా ఉప్పల్ సర్కిల్ పరిదిలోని ఉప్పల్ డివిజన్ శ్రీరామ నగర్ కాలనీలో జె.వి.హెచ్ ఫ్రడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈగ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ కార్పోరేటర్ మందముల పరమేశ్వరరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.
ఇక్కడ గణనాధునికి కేరళ సాంప్రదాయ తాత్విక పూజలు ప్రత్యేకత సంతరించుకుంది. కార్యక్రమంలో మొదటగా చిన్న పిల్లలతో ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అత్యంత పవిత్రమైన అడ్డూను వేలం వేశారు. ఈ వేలం పాటలో లడ్డూను బండ రాజశేఖర్ దంపతులు దక్కించుకున్నారు.
ఈ సందర్బంగా అధ్యక్షుడు ఈగ శేఖర్ మాట్లాడుతూ శ్రీ రామ కాలనీలో అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు ఎల్లపుడు అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఘనంగా వినాయకుడి వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన లసోసియేషన్ సభ్యులకు, వారికుటుంబ సభ్యులకు ,కాలనీవాసులకు కృతజ్ఞలు తెలిపారు. కార్యక్రమంలో జె.వి.హెచ్ ఫ్రడ్స్‌అసోసియేషన్ నిర్వాహకులు బి.శివ, జి.యశ్వంత్, బి.రాజు, టి.జనార్ధన్, డి. ప్రదీప్, కె.వంశీ, జి.శ్రీను, సాయి. రాము తదిరులు పాల్గొన్నారు.