37.2 C
Hyderabad
May 2, 2024 14: 32 PM
Slider ప్రత్యేకం

ఏపీలో మరింత మండనున్న ఎండలు

#tempareture

ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపనుంది. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు 46 డిగ్రీలు అంతకు మించి నమోదవ్వనుంది. ముఖ్యంగా కడప​, నంద్యాల​, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ జిల్లాల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉండనుంది.

కొన్ని చోట్లల్లో 47 డిగ్రీల దాక ఉష్ణోగ్రతలు నమోదయ్యినా ఆశ్చర్యపోనవసరం లేదు. మిగిలిన జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ​, తూర్పు గోదావరి, కొనసీమ​, పార్యతీపురం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల​, పుట్టపర్తి, కర్నూలు, కొనసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలను తాకనుంది.

ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు) లో మాత్రమే ఉష్ణోగ్రతలు 40 కి తక్కువగా ఉండనుంది. నగరాల వారీగా చూస్తే విజయవాడ, తిరుపతి, కడప నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఉంటుంది. విశాఖపట్నం నగరంలో మాత్రం వేడిగా 40 డిగ్రీలకు దగ్గరగా ఉంటుంది.  ఉక్కపోతగా వేడిగా ఉండనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4:30 గంటల మధ్యలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

Related posts

ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ గణేష్

Murali Krishna

మొక్కలు నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన కిషోర్ గౌడ్

Satyam NEWS

Analysis: ఆగుతున్న శ్వాసను నిలబెట్టే ఆశ

Satyam NEWS

Leave a Comment