29.7 C
Hyderabad
April 29, 2024 08: 07 AM
Slider సినిమా

ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కోటి రూపాయల పరువునష్టం కేసు

#RichaChadha

ఫిలిం మేకర్ అనురాగ్ కాశ్యప్ పై అత్యాచార యత్నం ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్ తనను కూడా ఆ వివాదంలోకి లాగేందుకు ప్రత్నించిందని, దీనివల్ల తనకు పరువునష్టం కలిగిందని చెబుతూ నటి రీచా చద్దా బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పాయల్ ఘోష్ తో బాటు కమాల్ ఆర్ ఖాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ తనకు రూ.1.1 కోట్లు పరిహారం ఇప్పించాలని రీచా చద్దా తన పిటిషన్ లో పేర్కొన్నది. అనురాగ్ కాశ్యప్ తనను 2013 లో రేప్ చేశాడని ఆరోపిస్తూ పాయల్ ఘోష్ వర్సోవా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

పోలీసులు నోటీసులు జారీ చేయడంతో అనురాగ్ కాశ్యప్ వర్సోవా పోలీస్ స్టేషన్ లో హాజరై తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పాయల్ ఘోష్ తాను రేప్ చేసినట్లు చెప్పిన తేదీలలో తాను విదేశాలలో ఉన్నానని ఆయన పోలీసులకు వివరణ ఇచ్చాడు.

అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ వారు 2013లో జరిగినట్లు చెబుతున్న ఆ సంఘటనను గ్రాఫిక్స్ ద్వారా రూపొందించి పాయల్ ఘోష్ ఇంటర్వ్యూతో కలిపి ప్రసారం చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఛానెల్ లో ప్రసారం చేయడమే కాకుండా వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో కూడా దీన్ని అప్ లోడ్ చేశారని పిటిషనర్ తెలిపారు.

ఈ వీడియోలను కమాల్ ఆర్ ఖాన్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 21న తాను పాయల్ ఘోష్ కు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి, కమాల్ ఆర్ ఖాన్ కు నోటీసులు జారీ చేసినా వారి నుంచి సమాధానం రాలేదని ఆమె పేర్కొన్నారు.

తాను నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా పాయల్ ఘోష్ అదే తరహా ఇంటర్వ్యూను విరల్ భయానీ అనే జర్నలిస్టుకు, పింక్ వాలా డాట్ కామ్ అనే వెబ్ సైట్ కు ఇచ్చారని పిటిషనర్ తెలిపారు. ప్రతివాదులకు మరొక్క మారు నోటీసులు జారీ చేయాలని బొంబాయి హైకోర్టు పిటిషనర్ కు సూచించింది. రేపు కేసు హియరింగ్ కు రానున్నది.   

Related posts

దిశ’ పోలీసు స్టేషన్ పరిశీలించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రివెన్ష్ చైల్డ్ రైట్స్ సభ్యులు

Bhavani

కబుర్లు చెప్పడం కాదు ఒక్కొక్కరు 10 లక్షలు ఇవ్వండి

Satyam NEWS

ఆది సాయికుమార్ చేతుల మీదుగా ‘నాతో నేను’ సాంగ్ లాంచ్

Bhavani

Leave a Comment