30.7 C
Hyderabad
April 29, 2024 04: 22 AM
Slider ముఖ్యంశాలు

సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

#Telangana Secrateriat

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది.

అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం సీ బ్లాక్‌ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు.

Related posts

తెలంగాణా సాధించింది బిజెపి నేత సుష్మా స్వరాజ్

Satyam NEWS

సినిమా రంగంలో రాణించాలనుకునేవారికి అన్ని శాఖలపై అవగాహన

Satyam NEWS

అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారిని జనసేన అండ

Satyam NEWS

Leave a Comment