29.7 C
Hyderabad
May 14, 2024 00: 27 AM
Slider ప్రకాశం

పేదవారి సత్రం స్వాహా చేయడానికి యత్నం

#OngoleRailwayStation

పేద వారికి ఉపయోగపడాల్సిన ఆస్తులను పెద్దవారికి పంచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఒంగోలు రైల్వే స్టేషన్ క్లౌ పేట లో శ్రీ పొత్తూరి అయ్యన్న శెట్టి  సత్రం ఉంది. సేవ కార్యక్రమాల కోసం తిరుపతి, శ్రీశైలం వెళ్లే భక్తులకు విశ్రాంతి కోసం దాతలు ఈ సత్రాన్ని నిర్మించారు.

ఈ సత్రానికి చెందిన భూమి ప్రస్తుతం కోట్ల రూపాయలకు చేరింది. ఈ సత్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ ఇప్పుడు దాన్ని వేరేవారికి అప్పగించేందుకు చట్టబద్దంగా చర్యలు ప్రారంభించింది. బహిరంగ లీజు ఇచ్చేందుకు వేలంపాట వేస్తూ ధార్మిక సంస్థల మనుగడను ప్రశ్నార్ధకం చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సిద్ధం అయింది.

ధార్మిక సంస్థల భూములను అన్యాక్రాంతం చేసేందుకు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దేవాదాయ శాఖ వ్యవహరిస్తున్నదని బిజెపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు మండిపడ్డారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పొత్తూరి అయ్యన్న శెట్టి  సత్రం తో పాటు ఒంగోలు లో ఇతర దేవాలయ భూములను కూడా అన్యాక్రాంతం చేసేందుకు వీలుగా బహిరంగ వేలం పాట లీజుకు ఇవ్వడానికి ఆయన తప్పు పట్టారు.

ఈరోజు ఒంగోలు పార్టీ నాయకులతో కలిసి దేవాదాయ శాఖ దానికి వ్యతిరేకంగా సత్రాన్ని  బహిరంగ వేలం పాటకు లీజుకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆది నుండి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు.

భక్తుల సేవ, దైవానికి సేవ చెయ్యడం మరిచి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మరి దేవాలయ భూములను అధికార పార్టీ కి కట్టబెట్టడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపక్రమిస్తున్నదని ఆయన విమర్శించారు.

Related posts

విద్యార్థుల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటం

Satyam NEWS

సీఐడీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లపై కిలారు రాజేష్ సంచలన పిటిషన్!

Satyam NEWS

17మంది పేకాట‌రాయుళ్ల అరెస్ట్‌

Sub Editor

Leave a Comment