26.7 C
Hyderabad
May 3, 2024 07: 59 AM
Slider కృష్ణ

సీఐడీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లపై కిలారు రాజేష్ సంచలన పిటిషన్!

#naralokesh

రెడ్ బుక్…. ఈ మాట వింటే ఏపీలోని కొందరు ఉన్నతాధికారులు ఉలిక్కిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ బుక్ లో ఏం రాశారు? ఏ ఏ పేర్లు ఆ బుక్ లో ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏపిలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు.

ఈ నేపధ్యంలో లోకేష్ పై ఇంటెలిజెన్సు నిఘా పెరిగింది. అయినా లోకేష్ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుంటున్నారు. మీడియా సమావేశంలో తన రెడ్ బుక్ విషయం లోకేష్ బాహాటంగానే చెబుతున్నారు కానీ ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో మాత్రం చెప్పడంలేదు. దాంతో రెడ్ బుక్ పై ఆ అధికారులకు ఉత్కంఠ మరింత పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఏపీలో సీఐడీ, ఇంటలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతల్ని వేధించడం.. తప్పుడు కేసుల్లో ఇరికించడానికి మాఫియాలాగా మారిన వైనం మరో వైపు కలకలం రేపుతోంది.. ఆ మాఫియా నుంచి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండేలా టీడీపీ నేత కిలారు రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

స్కిల్ కేసులో కిలారు రాజేష్‌ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారు. స్వయంగా నిఘా చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు. అసలు ఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తామని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహింపచేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లోని అంశాలు కలకలం రేపుతున్నాయి.

తన ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాల్ని వాడుకుని మాఫియాగా మారారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts

ప్రజల కోసమే చంద్రబాబు పోరాటం: నారా భువనేశ్వరి

Satyam NEWS

అంతేగా అంతేగా:సెట్స్ పైకి వెళ్లనున్న అసురన్ రీమేక్

Satyam NEWS

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment