29.7 C
Hyderabad
April 29, 2024 08: 27 AM
Slider నిజామాబాద్

దేవాడ పుల్కల్  వారధి ప్రారంభించిన మంత్రి వేముల

#minister Vemula

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య గత ఏళ్లతరబడి  ఎన్నో సమస్యలు సృష్టించినా వారధి 835కోట్లతో  నిర్మించిన   పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో   రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం  సాయంత్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.జుక్కల్ నియోజకవర్గ వర్గ అభివృద్ధికి హన్మంత్ షిండే ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయనను అభినందించారు.

ఆయన రాక కాస్త ఆలస్యం కావడంతో వర్షం కూడా పడింది.గొడుగులతో ఆయనను  స్థానికులు స్వాగతం పలికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో మంత్రితోపాటు జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే ,జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బిబి పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ దఫెధర్ శోభారాజు,ఎంపీపీ అశోక్ పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, వైస్ ఎంపీపీ రాజు పటేల్,బిచ్కుంద   సొసైటీ చైర్మన్ బాలాజీ(బాలు)  స్థానిక సర్పంచ్ శివనందప్ప, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లిఖార్జున్,స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత ఆర్అండ్బీ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తెరాస శ్రేణులు ఉన్నారు.

Related posts

కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్ కు విముక్తి

Satyam NEWS

రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు తరలి రండి

Satyam NEWS

ఎనాలసిస్: మార్చుకుంటారా? మరుగునపడిపోతారా??

Satyam NEWS

Leave a Comment