32.7 C
Hyderabad
April 26, 2024 23: 39 PM
Slider శ్రీకాకుళం

ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నఅధికారులు

Samagra skisha

కరోనా వ్యాప్తి కారణంగా అమలు జరుపుతున్న లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు, ప్రజలతో బాటు ఉద్యోగులు కూడా. అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ, అనుబంధ సిబ్బంది పని చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది పడుతున్న ప్రజల్ని మానవత్వంతో చూడండి అని చెప్పే ప్రభుత్వాలు సిబ్బంది పట్ల అమానవీయంగా పని చేస్తున్న ఉన్నతాధికారులను మాత్రం ఏమీ అనడం లేదు.

కరోనా ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా కరోనా డ్యూటీ చేసే సిబ్బందికి రక్షణ కవచాలు ఇచ్చి ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ను కాపాడుకోవాలి. మండల రెవెన్యూ అధికారులు మాత్రం కింది స్థాయి సిబ్బందిని మీరు ఎలా చేస్తారో మాకు తెలీదు వేసిన డ్యూటీ చేయాలి అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఆరోగ్య బోధకులను శ్రీకాకుళం జిల్లా తాసిల్దార్, మండల రెవెన్యూ సిబ్బంది బెదిరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 600 మందికిపైగా శాశ్విత వ్యాయామ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

అయితే గత 20 రోజుల నుంచి వీరందరికీ కాయగూరల మార్కెట్లలో, చేపల మార్కెట్ లలో మార్కెట్లోకి వచ్చే జనాలను సామాజిక దూరం పాటించే బాధ్యతను అప్పజెప్పారు. ఆ బాధ్యతను వారు ఆనందంగా చేద్దామనుకున్నారు. అయితే శాశ్వత వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రమే ఈ డ్యూటీ వేయాలని చాలా స్పష్టంగా ప్రోసిడింగ్ లో పేర్కొన్నారు.

కానీ ఈ ప్రోసిడింగ్ ను  తుంగలో తొక్కి శ్రీకాకుళం జిల్లాలో ఉండే మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు కలెక్టర్ ను తప్పుదోవ పట్టించి సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న తాత్కాలిక ఆరోగ్య బోధకులకు ఈ పని అప్పగించారు.

పార్ట్ టై ఉద్యోగాలు చేసే వీరికి ప్రొసీడింగ్స్ లో లేకుండా డ్యూటీలు వేస్తే వారు ఎలా పని చేయాలి? పని చేసినందుకు గుర్తింపు రావాలంటే కుదిరేపని కూడా కాదు. ప్రొసీడింగ్స్ లో లేకుండా డ్యూటీలు వేయడం వల్ల ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు వచ్చే సమయంలో తమకు గుర్తింపు లేకుండా పోతుందని వారు పడుతున్న బాధను అధికారులు అర్ధం చేసుకోవడం లేదు. అయితే ప్రొసీడింగ్స్ లో లేకుండా డ్యూటీ వేసి చేయకపోతే బెదిరించి భయపెడుతున్నారు. ఉద్యోగం నుంచి తీసి వేస్తామని, జీతము ఇవ్వమని, వచ్చే విద్యా సంవత్సరంలో ఉద్యోగం రెన్యువల్ చేయమని చెప్తున్నారు. దీంతో ఈ బోధకులు ఏం చేయాలో పాలుపోక భయపడుతూ విధులను నిర్వర్తించవలసి వస్తుంది. ఇప్పటికైనా సమగ్ర శిక్ష ప్రాజెక్టు చైర్మన్ కలెక్టర్ అర్ధం చేసుకుంటారా?

Related posts

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?

Satyam NEWS

బిసిలను ముట్టుకుంటే మసి అయిపోతావు జగన్ రెడ్డీ

Satyam NEWS

మద్య నిషేధంతో రాష్ట్రంలో మహిళలకు ప్రతి రోజూ పండుగే

Satyam NEWS

Leave a Comment