42.2 C
Hyderabad
April 30, 2024 16: 39 PM
Slider ముఖ్యంశాలు

డిజిటల్ మార్కెటింగ్ పై కెరీర్ గైడెన్స్

#Digitalbadi

డిగ్రీలు పాస్ అయి ఉపాధి అవకాశాల కోసం నగరాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉన్నచోటనే ఎలా రాణించాలి? ఈ విషయాలను ప్రముఖ బ్లాగర్ డిజిటల్ జాన్ వివరించారు.

వరంగల్ నగరంలోని SVS డిగ్రీ కళాశాలలో డిజిటల్ మార్కెటింగ్ పై ఒక అవగాహన సెమినార్ జరిగింది. ఇందులో పాల్గొన్న బ్లాగర్ డిజిటల్ జాన్  విద్యార్థులకు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉన్న అవకాశాల గురించి వివరించారు.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ ప్రాంతంలో ఉండి అయినా చేయవచ్చు. పల్లె కావొచ్చు, పట్టణం కావొచ్చు , కేవలం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న కంప్యూటర్ ఉంటే చాలు, మీకు ఉపాధి ఉన్నట్టే. విద్యార్థులకు డిజిటల్ మార్కెటింగ్ ని కూడా ఒక కెరీర్ అవకాశంగా ఆలోచించాల్సిందిగా డిజిటల్ జాన్ కోరారు. 

మహిళలు ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ని ఎంచుకుంటే కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించారు. మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ఇంటర్నెట్ , సోషల్ మీడియా ద్వారా ఎలా మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలో వివరించారు. 

కోవిడ్ సమస్య ఉండడం వాళ్ళ పరిమిత విద్యార్థులకు మాత్రమే ఈ సెమినార్ లో పాల్గొనే అవకాశం ఇవ్వడం జరిగింది. సెమినార్ అనంతరం విద్యార్థులకు ఉన్న సందేహాలను డిజిటల్ జాన్  నివృత్తి చేసారు.

Related posts

హిందూ దేవాలయాలను సాదువులకు అప్పగించండి

Satyam NEWS

డొనేషన్: రేషన్ బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి

Satyam NEWS

సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణి

Satyam NEWS

1 comment

Veerendar Sunkara March 16, 2021 at 3:56 PM

Good job john

Reply

Leave a Comment