30.7 C
Hyderabad
April 29, 2024 04: 17 AM
Slider ప్రత్యేకం

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదు

#NirmalaSeetaraman

కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో 1.75లక్ష కోట్ల ఆదాయం ఆర్జించాలని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకతను పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమే ప్రైవేటీకరణ ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమే ప్రధాన కారణాలని చెప్పారు. 

లోక్‌సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టినట్టు పేర్కొన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని ఆమె వెల్లడించారు.

Related posts

Pollution: ఢిల్లీలో స్కూళ్లు బంద్

Bhavani

ఆఖరు నిమిషం వరకూ రఘురామను ఎందుకు ఆపారు?

Satyam NEWS

ఘోర ప్రమాదంలో కుటుంబం బలి

Murali Krishna

Leave a Comment