30.7 C
Hyderabad
April 29, 2024 04: 04 AM
Slider ఆధ్యాత్మికం

హిందూ దేవాలయాలను సాదువులకు అప్పగించండి

#VHP

హిందూ దేవాలయాలను నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనందున తక్షణమే వాటిని సాదువులు, సంత్ లతో కూడిన కమిటీలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.

తమిళనాడులోని మదురై నగరంలోని పరవైలోని ఆకాష్ క్లబ్‌లోఈ నెల 4, 5 తేదీలలో విశ్వ హిందూ పరిషత్ తురవియర్ మానాడు పేరుతో సన్యాసి సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దినమలర్ గౌరవాధ్యక్షులు శ్రేయోభిలాషుల రిసెప్షన్ కమిటీ కో-ఎడిటర్ R. లక్ష్మీపతి, దేవకీ స్కాన్స్ డైరెక్టర్, రిసెష్షన్ కమిటీ కార్యదర్శి P.S. నాగేంద్రన్ పాల్గొన్నారు.

విశ్వ హిందూ పరిషత్ 1964లో స్థాపించబడినప్పటి నుండి, సన్యాసులు, సంత్ మరియు జ్ఞానుల మార్గదర్శకత్వంతో హిందూ సమాజం ఏకీకరణ, సాధికారత కోసం కృషి చేస్తోంది. హిందూ సమాజాన్ని చైతన్యం చేయడం, ఏకం చేయాలనే భావనతో తురవియర్ మానాడు పేరుతో సన్యాసి సదస్సును నిర్వహించింది. విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసే ఆధ్యాత్మిక నాయకుల వేదిక గా మార్గదర్శక్ మండల్ పని చేస్తుంది.

మార్గ్ దర్శక్ మండల్, అంటే తమిళంలో అరవాజి కట్టుమ్ ఆండ్రోర్ పెరవై అంటారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాల్లో హిందూ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో విలేకరుల సమావేశాలు, సమావేశాలు నిర్వహించారు.

ఈ సదస్సు జూన్ 4వ తేదీన ప్రారంభమై అందరి అభివృద్ది కోసం ప్రత్యేక హోమం నిర్వహించి, అనంతరం ధ్వజారోహణం, ఆవుపూజ, సకల సాదువులు, జ్ఞానుల పాదపూజ నిర్వహించారు. ఈ సదస్సులో 200 మందికి పైగా ఆధీనాలు, సాధువులు, అన్ని సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి శ్రీ మధురై ఆధీనం గురు మహాసన్నిదానం శ్రీ ల శ్రీ హరిహర దేశిగ జ్ఞానసంపంద పరమాచార్య స్వామిగళ్ అధ్యక్షత వహించారు. శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు శ్రీమద్ కమలతామానంద స్వామి వారి ఆశీస్సులు అందించారు.

దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

శ్రీ. విశ్వహిందూ పరిషత్ జాతీయ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె. స్థాణుమలయన్ ఈ మెగా కాన్ఫరెన్స్ ఆవశ్యకత గురించి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీ తిరుపేరూర్ ఆదేనం శ్రీ శాంతలింగ మరుదాచల అడిగలర్ రెండు రోజుల చర్చల గురించి వివరించి, గౌరవనీయులైన ప్రముఖుల ముందు తీర్మానాలను సమర్పించారు.

స్వామి వేదంతానంద ఈ సదస్సుకు మార్గదర్శనం చేశారు. రెండు రోజుల సదస్సులో నేటి సందర్భానికి సంబంధించిన తీర్మానాలపై కూలంకషంగా చర్చించారు. గౌరవనీయులైన సన్యాసులు ప్రతి అంశాన్ని గురించి వివరంగా చర్చించారు. మొదటి తీర్మానంలో ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమస్యను ప్రస్తావించింది. హిందూ దేవాలయ నిర్వహణను పూర్తిగా సన్యాసులు, హిందూ సంస్థలు భావసారూప్యత కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం అప్పగించాలని గట్టిగా డిమాండ్ చేశారు. క్రైస్తవ సంస్థలు, ముస్లిం సంస్థల బలవంతపు మతమార్పిడులు చట్టవిరుద్ధమైనవని వాటిని తీవ్రంగా ఖండించారు.

మత మార్పిడి అనేది జాతీయ ముప్పు కాబట్టి ఈ మార్గదర్శక్ మండల్ తమిళనాడులో కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక నాయకులు గతంలో మతం మారిన వారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరంలో నైతిక విలువను పునరుద్ధరించడానికి అధికారిక విద్యలో ఆధ్యాత్మిక సిలబస్‌ కూడా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది.

పర్యావరణాన్ని కాపాడుకోవాలి

పర్యావరణాన్ని కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడం అనే అంశంపై తదుపరి ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇందులో నీటి సంరక్షణ, గోసంరక్షణ, సహజ వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. హిందూ సమాజంలో సామాజిక సామరస్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రస్తావించారు. సంఘటిత హిందూ సమాజం మాత్రమే అన్ని సామాజిక దురాచారాలను నిర్మూలించగలదనే అభిప్రాయాన్ని సాదువులు వెలిబుచ్చారు.

హిందువు పేరుతో సెయింట్ హుడ్ ఇవ్వడం పెద్ద కుట్ర

దైవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ను ప్రదానం చేయాలనే పోప్ నిర్ణయాన్ని ఖండిస్తూ చేసిన చివరి తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మతం మారిన వ్యక్తిని హిందూ పేరుతో పిలవడం కుట్ర అని, అతనికి సెయింట్ హుడ్ ఇవ్వడం ఉద్దేశపూర్వకంగా మత మార్పిడిని ప్రోత్సహించడానికి అని వారు అభిప్రాయపడ్డారు. అలాగే హిందూ సమాజాన్ని విభజించడానికి ఇది పెద్ద కుట్రటా వారు అభివర్ణించారు.

ఈ సదస్సులో భాగంగా, జూన్ 5, 2022 సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సన్యాసులు అధ్యక్షత వహించారు. మధురై ఆదీనం శ్రీ పేరూర్ అధీనం శాంతలింగ మరుధాచల అడిగలర్ శ్రీ. శ్రీ. మిలింద్, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ పెజావర్ మఠాథిపతి శ్రీమద్ ప్రేసన్న తీర్థ స్వామిగల్, ఉడిపి, రామజన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు సభను ఆశీర్వదించారు.

Related posts

మరో వూహాన్ లా మారిన తూర్పుగోదావరి జిల్లా

Satyam NEWS

విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్ళిన బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

ఓట్ల కోసం సూపర్ స్టార్ కృష్ణను అవమానించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment