32.7 C
Hyderabad
April 27, 2024 02: 16 AM
Slider ప్రత్యేకం

వరికి బదులు ఆరు తడి పంటలు వేయాలి: సీఎం కేసీఆర్

#cmkcr

రైతులు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలనీ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో వస్తూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామం జాతీయ రహదారి 44 పై ఉన్న పంట పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా అక్కడ మినుము, వేరుశెనగ పంటలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో బాటు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, వ్యవసాయాధికారులు తో మాట్లాడుతూ రైతులు యాసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకునే అవగాహన కల్పించాలని అన్నారు.

మినుము పంట రైతు మహేశ్వరరెడ్డి తో మాట్లాడుతూ మినుము పంట ఎన్ని ఎకరాలు  వేశావ్ అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఐదెకరాలు మినుము పంట వేసినట్టు రైతు తెలిపాడు. టీ9 రకం మినుము పంట సాగు చేశానని క్వింటాల్ కు 8 నుండి 12 వేల వరకు ఉంటుందని 90 రోజులలో పంట కాపు వస్తుందని రైతు తెలిపాడు.

పంట మార్పిడితో దిగుబడి బాగా వస్తుంది

పంట మార్పిడి వల్ల దిగుబడి బాగా వస్తుంది అని ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతు వివరించాడు. వేరుశనగ పంట సాగు చేసిన రాములు తో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వేరుశెనగ క్వింటాల్ ఎంత ఉందని రైతును ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఏడు నుండి ఎనిమిది వేల వరకు వేరుశెనగ మద్దతు ధర ఉందని రైతులు తెలిపాడు.

వరికి బదులు ఇతర పంటలు సాగు చేయడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని ముఖ్యమంత్రి రైతులకు వివరించారు. మాట్లాడారు. అలాగే విలియం కొండ దగ్గర రైతులు సాగుచేసిన  వేరుశనగ పంటలను ముఖ్య మంత్రి పరిశీలించారు సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, యం. ఎల్. ఏ.లు, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్ వన్, డి. వేణు గోపాల్, వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ఈ నెల 20న కూకట్ పల్లి రామాలయం పున:ప్రతిష్ట

Satyam NEWS

హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. సరిహద్దుల్లో వంతెన ధ్వంసం..

Sub Editor

విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ తో పాటు మీనింగ్ ఫుల్ గా ఉండాలి

Bhavani

Leave a Comment