39.2 C
Hyderabad
May 3, 2024 13: 25 PM
Slider చిత్తూరు

విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ తో పాటు మీనింగ్ ఫుల్ గా ఉండాలి

#RK Roja

విద్యార్థుల జీవితాలు రంగులమయం గానే కాకుండా అర్థవంతంగా కూడా ఉండాలని రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జనవరి 3 వ తేదీ నుంచి 7 వ తేది వరకు జరుగనున్న 36వ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ ” పద్మతరంగ్ ” ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

కాలేజీ రోజులు అనేవి విద్యార్థుల జీవితానికి ఒక పునాదిగా ఉంటుందని, ఏమి కావాలి అనేది డిసైడ్ చేసుకుని ఒక ఫ్రేమ్ వేసుకుని దానికి తగ్గట్టుగా ద్రుష్టి సారిస్తే కచ్చితంగా లక్ష్యం సాధిస్తారని చెప్తూ విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ గా ఉండడమే కాకుండా మీనింగ్ ఫుల్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఏదైనా కూడా వేదికపై ప్రదర్శించినప్పుడు అంకితభావంతో పని చేసినప్పుడు విద్యార్థులకు రావాల్సిన అవకాశాలు భగవంతుడే తీసుకు వస్తారని తెలిపారు.

అందుకే పెద్దలంటారు “మనమేమిటో చెప్పాల్సిన అవసరం లేదు మన సక్సెస్ మాట్లాడుతుంది” అని చెప్పారు. మీరు కష్టపడి శ్రమపడుతూ చాలు, ప్రతిభకు సాన పడుతుంటే చాలు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని తెలిపారు.

అది నా జీవితంలో చూశానని వివరించారు. సక్సెస్ సాధించిన వారు అన్ని కష్టాలు అనుభవించి అన్ని అవమానాలు ఫేస్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు నేరుగా ఒక లక్ష్యం పై దృష్టి పెట్టి కృషి చేశారని అందుకే వారు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పారు. ఆరంభం లోనే ఎవరికీ సక్సెస్ లు రావని సక్సెస్ వచ్చేవరకూ విద్యార్థులు పోరాడాలని పిలుపు నిచ్చారు.

ఈ కాలం పిల్లలు చిన్న చిన్న వాటికి ఆందోళన చెందుతున్నారని, పిల్లలు సెన్సిటివ్ గా ఉన్నారని వివరించారు. చదువు ఒక్కటే ముఖ్యం కాదని చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు అనేవి కూడా చాలా ముఖ్యం అని కల్చరల్ ఆక్టివిటీస్ చేయడంవల్ల సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన వాళ్ళ అవుతామని విద్యార్థులకు కూడా ఒక రిలాక్సేషన్ ఉంటుందని తెలిపారు. పోటీలకు వెళ్ళినప్పుడు చాలామంది నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ అలవాటు అవుతుందని తెలిపారు.

Related posts

ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవలను విజయవంతం చేయాలి

Satyam NEWS

బూతులతో రెచ్చిపోయిన పోలీసు కానిస్టేబుల్

Satyam NEWS

వీర సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment