29.7 C
Hyderabad
April 29, 2024 07: 16 AM
Slider ముఖ్యంశాలు

చెరువు పండగ లో అపశృతి

#pond festival

సంబురంగా చెరువు పండుగ చేసుకుంటున్న క్రమంలో తేనెటీగలు దాడి చేయడంతో 25 మందికి పైగా గాయాలైన ఘటన నార్సింగ్ మండల పరిధిలోని వల్లభాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్సింగ్ మండల పరిధిలోని

వల్లభాపూర్ గ్రామస్థులు బోనాలు బతుకమ్మల ఊరేగింపుతో చెరువు వద్దకు వెళ్తుండగా.. డీజే సౌండ్ వైబ్రేషన్ కు తేనెటీగలు దాడి చేశాయి. వైకుంఠధామం, డంపు యాడ్ సమీపంలో ఉన్న చెట్ల వద్ద నుంచి తేనెటీగలు ఒక్కసారిగా లేచి

రావడంతో 25 మంది వరకు గాయాలయ్యాయి. డప్పు చప్పులతో ఆనందంగా చెరువు వైపు వెళ్తున్న వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో చెల్లాచెరురైపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని రెడ్డిపల్లి కాలనీలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్

వద్దకు తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. సంబరంగా చెరువు పండుగ చేసుకునే సందర్భంలో తేనెటీగలు దాడి యడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందారు. వార్డు సభ్యుడు బోయిన భూషణం, ఉపసర్పంచ్ ఇస్తారమ్మతో పాటు చాలామందికి తీవ్రంగా తేనెటీగలు కుట్టడంతో గాయాలయ్యాయి.

Related posts

విజేతగా నిలిచిన నలంద డిగ్రీ కాలేజి జట్టు

Bhavani

గుంటూరులో 13 బైకులను తగులబెట్టిన ఆకతాయిలు

Satyam NEWS

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

Bhavani

Leave a Comment