38.2 C
Hyderabad
April 29, 2024 22: 13 PM
Slider వరంగల్

స్కూలు పిల్లలకు పుస్తకాల పంపిణీ

#school children

హన్మకొండ జిల్లా రాంపూర్ గ్రామం ప్రాధమిక పాఠశాల పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, రీవాక్ సంస్థ సభ్యులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి పాల్గొన్నారు. విద్యార్ధులకు లాంగ్ నోట్ బుక్స్, స్టేషనరీ అందచేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పేదరికం పిల్లల చదువుకు ఆటంకము కారాదని అందుకే ఏ ఇబ్బంది కలుగకుండా పుస్తకాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చక్కగా చదువుకొని వృద్ధి లోకి రావాలని, ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడి చదువుకోవాలని కోరారు.

మధ్యాహ్న భోజనం బాగుంటుందా కూరలు బాగుంటున్నాయా, సన్న బియ్యం తో వండుతున్నారా, వంటశాల శుభ్రంగా ఉందాలేదా అని ఆమె పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. రీవాక్ చైర్మన్ మోహన మురళి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని, చదువుతోపాటు మంచి నడవడిక తో ఎదగాలని అన్నారు.

అనాధ పిల్లల సేవ విశ్వమానవ సేవ అని, విద్యా దానం మహాదానం అన్నారు. వీరికి ఏ అవసరమున్నా తోచినమేర సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని అన్నారు. ఈ కార్యక్రమం లో సిద్దార్థ రెడ్డి, శాంసుందర్, స్కూల్ హెచ్. ఎం సమ్మయ్య, టీచర్స్ రవీందర్ రెడ్డి, లక్ష్మీ, స్వర్ణలత, అరుణ, సిబ్బంది,పిల్లలు పాల్గొన్నారు.

Related posts

56వ రోజుకు చేరిన గ్రామ రెవెన్యూ సహాయకుల దీక్ష

Satyam NEWS

ఆర్టీసీ ఎమ్.డి ద్వారా వనపర్తి డిపోకు అవార్డులు

Satyam NEWS

25న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మావోలు

Satyam NEWS

Leave a Comment