30.7 C
Hyderabad
April 29, 2024 06: 18 AM
Slider విజయనగరం

అటెన్ష‌న్ డైవ‌ర్ట్ గ్యాంగ్..14 తులాల గోల్డ్ అప‌హ‌ర‌ణ‌

#VijayanagaramPoliceForce

మీ బ్యాగ్ కింద పడిపోయిందండీ…మీ డ‌బ్బులు స‌రిగ్గా చూసుకోండి…ప్ర‌యాణిస్తున్నారు..జాగ్ర‌త్త అంటూ దృష్టి మ‌ర‌ల్చి…దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డ గ్యాంగ్ ను అరెస్ట్ చేసారు…విజ‌య‌నగ‌రం జిల్లా సీసీఎస్, లా అండ్ ఆర్డ‌ర్ పోలీసులు.

జిల్లా కేంద్రంలోని మూడు రోజుల క్రితం త‌న స్వ‌స్థ‌లం అయిన వేణుగోపాల‌పురం వెళుతున్న ఓ మ‌హిను గ‌మ్య‌స్థానానికి తీసుకువెళ‌తామ‌ని చెప్పిన ఓ మ‌హిళ‌తో పాటు ఇద్ద‌రు ఆటో ఎక్కింది….ఆ మ‌హిళ బ్యాగ్ లో ఉన్న సుమారు 14 తులాల బంగారాన్ని అప‌హ‌రించారు.

ఏం జ‌రిగిందో తేరుకునే లోపే ఆ ఆటో వెళ్లిపోవ‌డంతో ఆ రోజే ఆ బాధితులురాలు ట్రాఫిక్ పోలీసుల ద్వారా రూర‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.కేసు క‌ట్టిన పోలీసులు..మూడురోజుల‌లో నిందితుల‌ను శ్రీకృస్ణ జ‌న్మ‌స్థానానికి త‌ర‌లించారు.

ఈ  మేర‌కు న‌గ‌రంలోని గంట‌స్థంబం వ‌ద్ద సీసీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీసీఎస్ డీఎస్పీ పాపారావు, లా అండ్ ఆర్డ‌ర్ డీఎస్పీ అనిల్ సంయుక్తంగా మీడియా తో మాట్లాడి దొంగ‌త‌నం ఎలా జ‌రిగిందొ తెలియ చేసారు.

ఈ నెల 6 న వేణుగోపాల‌పురంకు చెందిన సూర్యావ‌తి త‌న భ‌ర్త‌తో..ఎంజీ రోడ్డులోని నారాయ‌ణ దాస్ షాపు నుంచీ కుక్క‌ర్ కొనుగోలు చేసి త‌న స్వ‌స్థ‌లానికి వెళ్లే క్ర‌మంలో మూడు లాంత‌ర్ల వ‌ద్ద ఆటోలో ప్ర‌యాణీకుల వ‌లే…ఎల్ల‌ర‌మ్మ‌,మేక‌ల ర‌వి,ఎర్రినాయుడు..ఆమెను స్వ‌స్థ‌లానికి తీసుకెళ‌తాన‌ని దృష్టి మ‌ర‌ల్చి..ఆమె బ్యాగ్ ను అప‌హ‌రించారు.

ఆ బ్యాగ్ లో సుమారు 14 తులాలు విలువ చేసే బంగారు ఎత్తుకెళ్లారు.ఆ రోజు రాత్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్క‌డే ఉన్న సీసీపుటేజ్ ద్వారా నిందితుల‌ను గుర్తించి…కొత్త వ‌ల‌స‌కు  చెందిన వార‌ని నిర్ధారించుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేసారు..

ఈ మీడియా సమావేశంలో సీసీఎస్ సీఐ కాంతారావు,రూర‌ల్ సీఐ మంగ‌వేణి,ఎస్ఐలు నారాయ‌ణ‌,ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కుమార్, రాజారావు, ఏఎస్ఐ త్రినాధ‌రావు,భానూజీరావు, ష‌పీలు ఉన్నారు.

Related posts

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

Satyam NEWS

సినీ నటుడు రాజీవ్ కనకాల సోదరి మృతి

Satyam NEWS

గుజరాత్:100 దాటిన మరణాలు

Bhavani

Leave a Comment