42.2 C
Hyderabad
April 26, 2024 15: 34 PM
Slider వరంగల్

లార్డ్ వృద్ధాశ్రమంలో అ౦బరాన౦టిన దీపావళి సంబరాలు

#anurag

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డా. కె.అనితారెడ్డి హన్మకొండలోని లార్డ్ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో టపాసులు కాల్పించి దీపావళి వేడుకలను  ఘనంగా జరిపారు. 

దీపావళి టపాసులు అందించడమే కాక వారితో సంబురాలు జరిపించడం ప్రత్యేకత. ఈ సందర్భంగా కె.అనితారెడ్డి మాట్లాడుతూ పండుగ అంటేనే మనం సంతోషంగా ఉండడం పది మందిని సంతోషపెట్టడం  అని  అన్నారు. వృద్ధులు  పిల్లలతో సమానం అని ఆమె అన్నారు.

ఈ వృద్ధులు సంతోషంగా టపాసులు కాల్చుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుగానే వీరికి టపాకాయలు ఏర్పాటు చేసానని ఆమె తెలిపారు. మానవ సేవ మాధవ సేవ అని ఆమె అన్నారు.

వృద్ధులు సేవ దైవ  సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వృద్ధులకు ప్రేమని పంచాలని,  వారిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గాంధి కుటుంబానికి చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సహాయం

Satyam NEWS

Analysis: మూడో ముప్పులో అలసత్వం

Satyam NEWS

తెలంగాణ‌లో 27,077 క‌రోనా ప‌రీక్ష‌లు, 238 పాజిటివ్ కేసులు

Sub Editor

Leave a Comment