39.2 C
Hyderabad
May 3, 2024 11: 52 AM
Slider వరంగల్

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పై ఆరోపణలు సరి కాదు

#taslima

జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పై చేస్తున్న ఆరోపణలు సరి కాదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాపర్థి కుమార్ గాడ్గే అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో గురువారం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో చాపర్తి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తురాలు, సామాజిక ఉద్యమాల ఆడబిడ్డ, సామాజిక సేవకురాలు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ పై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కష్ట కాలంలో నిరుపేదల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.

అలాంటి ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పై బిసి సంఘం ముసుగులో, తీన్మార్ మల్లన్న టీమ్ లో పని చేస్తూ మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తి జీర్ణించుకోలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమాల పోరాట యోధుడు మహ్మద్ సర్వర్ ఉద్యమాల వారసురాలు తస్లీమా పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. అలాగే కొందరు స్వార్థ పరులు తప్పుడు వార్తలు సృష్టిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న వారిని అవమానాలు పరుస్తున్న ఇలాంటీ దుష్ట శక్తులను ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

పేద ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను, సామాజిక సేవకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా సంఘాల మీద, ప్రజల మీద ఉన్నదని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే రాష్ట్ర అధ్యక్షులు కేడళ ప్రసాద్, ఇంటి పార్టీ ఉద్యమకారులు కొమురన్న, ప్రజా సంఘాల నాయకులు శనిగరపు నరేష్, చింతనిప్పుల బిక్షపతి, బోడ రాజు, నక్క రాజు, సిపిఐ పార్టీ జిల్లా నాయకులు చిక్కుల వెంకటేష్, విశ్వనాథ్, కొట్టెపాక శ్రీనివాస్, కే నరేష్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

వేంచేయవమ్మా ….

Satyam NEWS

నేల కాలుష్యానికి పరిష్కారంగా ఉండండి

Satyam NEWS

ఈనాడు ఫొటోగ్రాఫర్ రాజమౌళి మృతికి సంతాపం

Satyam NEWS

Leave a Comment