31.7 C
Hyderabad
May 2, 2024 07: 42 AM
Slider సంపాదకీయం

వైసీపీకి పిడుగులాగా మారిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు

#modi

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నోటి నుంచి జగన్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తొలి సారిగా బహిరంగంగా వ్యతిరేక వ్యాఖ్యలు రావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బిజెపి రాష్ట్ర నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప కేంద్రం నుంచి కూడా పెద్దగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపి అడిగినప్పుడల్లా నిధులు విడుదల చేస్తుండటం, నిబంధనలు సడలిస్తుండటంతో జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఏదోక విధంగా నెట్టుకుంటూ వస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతే కారణం. అమరావతి విషయం నుంచి ఆర్ధిక పరిస్థితి వరకూ కేంద్రం జగన్ ప్రభుత్వానికి సాయం అందిస్తూనే వచ్చింది.

తాము అన్ని విషయాలూ కేంద్రంలోని పెద్దలకు చెప్పే చేస్తున్నామని వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి ఇంతకు ముందే వివరణ కూడా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రం నుంచి మద్దతు లభిస్తుండటంతో విజయసాయిరెడ్డి చెప్పినదే నిజమని కూడా చాలా మంది నమ్మారు. కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పి వారు వ్యాట్ తగ్గించకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినాయని గోలపెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని అరగంట సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘‘పెట్రోలు ధరలు ఆయన పెంచుతూ మమ్మల్ని తగ్గించమంటాడేంటి?’’ అంటూ కేసీఆర్ ప్రధానిని ప్రశ్నించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ మాటా రాలేదు. ప్రధాని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ను తొలి సారి బహిరంగంగా విమర్శించడం ఏమిటి అనే సంభ్రమాశ్చర్యాలలో వైసీపీ నాయకులు మునిగిపోయారు. ఇది బిజెపి తమకు వ్యతిరేకంగా మారిపోయిందనేది సూచిస్తున్నదని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో వైసీపీ పేరు పెట్టడంతోనే బిజెపికి కూడా పరిస్థితి అర్ధం అయిందని అందుకే ప్రధాని ఈ విధంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. వైసీపీ అవకాశవాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నదని బిజెపి ఇప్పటికే నమ్ముతున్నదని కూడా వారు విశ్లేషించుకుంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలతో ఇక తాము ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే ఉందని కూడా వైసీపీ నాయకులు అంటున్నారు.

Related posts

హుజూర్ నగర్ లో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

ధనుర్మాసం సందర్భంగా విజయనగరం ఏడు కోవెళ్లలో తిరుప్పావడ సేవ

Satyam NEWS

కన్నా రాకతో అంబటి గుండెల్లో దడ

Bhavani

Leave a Comment