39.2 C
Hyderabad
April 30, 2024 22: 21 PM
Slider గుంటూరు

ఆస్తి విలువ పై ఇంటి పన్ను వేసే విధానాన్ని రద్దు చేయాలి

#NarasaraopetRoundTable

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకునే ఆలోచనను విరమించుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని ప్రసంగించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి విపరీతంగా పన్నులు వసూలు చేయడానికి సిద్ధపడుతున్నాయని ఆయన అన్నారు.

కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను పన్నుల పేరుతో పీడించడం, అధికార భారం వేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు.

సిపిఐ జిల్లా  కార్యదర్శి కాసా రాంబాబు అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

Related posts

ప్రశాంత్ కిషోర్ ఒక్క సారి ఏపి వైపు కూడా చూడు

Satyam NEWS

పేదల పెన్నిధి, అభ్యుదయ వాది శానంపూడి అంకిరెడ్డి వర్ధంతి

Satyam NEWS

లొల్లి

Satyam NEWS

Leave a Comment