29.7 C
Hyderabad
April 29, 2024 08: 29 AM
Slider కవి ప్రపంచం

లొల్లి

#Manjula Surya New

గీ లొల్లేన్దో సమజైతలేదు

ఎప్పుడు జూషినా పట్నంల

బండ్లు తిరిగినట్టు  నెత్తిల గా తొలుసుడేందో

సెదపురుగుల్లా నలుసుడేందో

పిల్ల తల్లిని జూసి వొచ్చినట్లు

ఉత్తగ గూసుంటే ఉరుకురికి వస్తది

పన్లు జేస్తుంటే  దాని పని అది జేస్తనేవుంటది చట్టం దాని పని అది జేసుకున్నట్ల

సల్లంగా యాడ గూసోనియ్యదు

మనిషికి చైన్ వడనియ్యదు

గందుకే దీని పని వడదమనుకున్న

కూసుంటి ముని లాగా కండ్లు మూసుకుని

ద్యాస పెట్టనింకే జూస్తి శాస మీద

ఇగ జూతునా టీవీల చానెళ్లు  తిరిగినట్ల

ఒకటి గాంగనే ఒక ఆలోషన్లు

యాడికి అయిపోని సీరియళ్ల లెక్క

దానికొక లెక్కలేదు పత్రం లేదు

ఐదు నిమిషాలు కూసుంటి గట్లనే

సప్పుడు జెయ్యకంటే నా మాట ఇనుడే లేదు

పాణం పరేషాన్ అయిపాయే

ఆస్తుల కోసం కొట్లాడతం కులాల కోసం

కొట్లాడతం

మరి మన ఆలోచన్లనెందుకు షేత్ల పెట్టుకొన్నింకే కొట్లాడమో

రేపైతే నేను  మల్ల గట్టిగ గూసుంట రాయిలెక్క

దీని సంగతేందో జూస్త

మీరుగూడ జెయ్యుండ్రి మల్ల

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Bhavani

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

సాయిబాబా ఆలయానికి ‌ఐఎస్ఓ సర్టిఫికేట్

Sub Editor

Leave a Comment