38.2 C
Hyderabad
April 29, 2024 14: 45 PM
Slider విజయనగరం

ఒక్క రోజులో దిశ యాప్ ను ఎంత‌మంది డౌన్ లోడ్ చేసుకున్నారో తెలుసా..?

#dishaapp

వ‌రుస‌గా రెండోసారి కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు లేడీ బాసే ఎస్పీగా రావ‌డంతో..శాఖ‌లో దిశ పోలీస్ సిబ్బంది అందులో మ‌హిళా పోలీసులు కాస్త ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌లో శంషాబాద్ వ‌ద్ద ఒక  సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను కొంద‌మంది మ‌ద్యం సేవించి సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న తెలుగు రాష్ట్రంలో పెను సంచ‌ల‌న‌మే అయ్యింది.

ఇక ఏపీలో తొలిసారిగా అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్..వ‌చ్చి రాగానే..దిశ పేరుతో  మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించి ఏకంగా పోలీస్ స్టేషన్ల‌నే  ప్రారంభించిన సంగితి పాఠ‌కుల‌కు విదితమే. గ‌త డీజీపీ గౌతం స‌వాంగ్ కూడా….దిశ యాప్..పైనే దృష్టి పెట్టారు. 2019లో జిల్లాకు వ‌చ్చిన ఎస్పీ  రాజ‌కుమారి దిశ యాప్ …ఏకంగా గిరిశిఖర గ్రామ‌ల‌లో అమ్మాయిల‌కు శిక్ష‌ణ ఇచ్చిమ‌రీ దిశ యాప్ ఎస్ఓఎస్ బ‌ట‌న్ పై అవ‌గాహ‌న క‌ల్పించారు కూడ‌.

ఆ స‌మయంలోనే కొత్త‌గా విజ‌య‌వాడ‌లో ఏర్పాటైన దిశ వింగ్ కు చీఫ్  దీపికా ఎం పాటిల్ ఉన్నారు కూడ . తాజాగా  జిల్లాకు  ఆమెనే ఎస్పీగా రావ‌డంతో…దిశ యాప్ అందులో ఎస్ఓఎస్ ప‌నిత‌రం గురించి శాఖాసిబ్బందికి శిక్ష‌ణ ఇప్పించే చ‌ర్య‌లు చేపట్టారు. దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా  అవగాహన కార్యక్రమాలను చేపట్టార‌.

ఒక్క రోజే 198 మంది  దిశా యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ల లో నిక్షిప్తం చేసుకొనే చర్యలు చేపట్టారు. దీంతో దిశా యాప్ ఇంత వరకు డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 4 ల‌క్ష‌ల ,21వేల‌,005 కు చేరింది.  ఈ దిశ యాప్ ద్వారానే జిల్లా వ్యాప్తంగా మహిళపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న 485 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, వాటిపై నిఘా ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసింది….పోలీస్ శాఖ‌

Related posts

టిడిపి నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం

Satyam NEWS

జగన్ ను మెచ్చుకుంటున్నారు వైసిపిలోకి వస్తున్నారు

Satyam NEWS

పోలీసుల ఓవర్ యాక్షన్ తో కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment