29.7 C
Hyderabad
April 29, 2024 10: 49 AM
Slider నెల్లూరు

ఏరువాక కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.సంధ్యకు డాక్టరేట్

#m.sandhya

నెల్లూరు ఏరువాక కేంద్రం లో వ్యవసాయ శాస్త్రవేత్త గా పనిచేస్తున్న ఎం.సంధ్య కి గుంటూరు లోని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది.

డా. జాగర్లమూడి వెంకట రమణ మార్గదర్శకత్వంలో ఇక్రిశాట్ నుండి పొందిన చిరుధాన్యg  కొర్ర రకాలలో మాలిక్యులర్ మార్కర్స్ సహాయంతో జీవ వైవిధ్యం పై  చేసిన పరిశోధనలకు గాను డాక్టరేట్ ను ప్రదానం చేశారు. (మోర్ఫోలోజికల్, బయోకెమికల్ &  మాలిక్యులర్   క్యారెక్టరైజేషన్ అఫ్ ఫాక్స్ టైల్ మిల్లెట్ జెరంప్లాసం) ఈ సందర్భంగా నెల్లూరు ఏరువాక కేంద్రం సమన్వయ కర్త ఆచార్య యం సి ఓబయ్య, వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ ఆచార్య పి రాజశేఖర్, ఇతర శాస్త్రవేత్తలు డా. యం సంధ్య ను అభినందించారు.

ఈ పరిశోధన ఫలితాలు కొర్ర పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు గుర్తించటమే కాక కొత్త వంగడాలను రూపొందించటానికి ఉపయోగపడతాయని అన్నారు. తన పరిశోధనలకు సహాయపడిన ఆచార్య వి పద్మకి, ఆచార్య ఎ విజయ గోపాల్, డా. డి రత్న బాబుకి   ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి పరిశోధనలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆనం విష్ణువర్ధన్ రెడ్డి కి డా. యం సంధ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆర్టీసీ బిల్లు పై సందేహాలు.. సిఎస్ కు గవర్నర్ లేఖ

Bhavani

భద్రాచల రామాలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభం

Bhavani

పెంచుతున్న పన్నుల సొమ్ము అంతా సొంత పత్రికకే

Satyam NEWS

Leave a Comment