28.2 C
Hyderabad
May 9, 2024 02: 17 AM
Slider మహబూబ్ నగర్

కరోనా బాధితులను పట్టించుకోని ప్రభుత్వం: ప్రవేట్ ప్రాక్టీసులో డాక్టర్లు

#WanaparthyHospitals

వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గురించి మంత్రి నిరంజన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పట్టించుకోవడలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతే సహించేది లేదని, నాగవరం దగ్గర ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో వెంటనే కోవిడ్ రోగులకు చికిత్స అందించాలని రాచాల గౌడ్ డిమాండ్ చేశారు.

గురువారం నాడు బీసీ సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి వనపర్తిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి  ఆర్ఎంఓ చైతన్య గౌడ్ తో మాట్లాడి ఆస్పత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎంత మంది కోవిడ్ రోగులు ఉన్నారు,

ఎంతమంది చనిపోయారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా టెస్టుల కోసం వచ్చిన ప్రజలు వారం నుంచి రోజు వస్తున్నామని, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని తమ గోడును రాచాల వద్ద మొరపెట్టుకున్నారు.

అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో  46 ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఉన్నాయని అవికూడా నిండాయని డాక్టర్ చెబుతున్నారని, కానీ నాగవరం లోని వైటిసి బిల్డింగ్ లో 100 బెడ్లతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో వైద్యం అందించకుండా వేరే ప్రాంతాలకు ఎందుకు రెఫెర్ చేస్తున్నారని మండిపడ్డారు.

కాసులకు కక్కుర్తిపడి పేద ప్రజల రక్తాన్ని జలాగల్లా పీల్చుతున్నారని, ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేయాల్సిన వైద్యులు ప్రైవేట్ క్లినిక్ లు నడుపుతూ  ప్రజలకు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని, కోవిడ్ విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితిల్లో 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్స్ కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకే వుంటూ ఆ తర్వాత సంబంధం లేదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రోజు 25 టెస్టులు మాత్రమే చేస్తున్నారని, రోగులు వారం నుంచి వస్తున్న కూడా టెస్టులు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుంటే జిల్లా మంత్రి ఏడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ఉన్నతాధికారులు గాని ఒక్కరోజైనా ఆసుపత్రిని సందర్శించి వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడారా అని సూటిగా ప్రశ్నించారు.

నాగవరంలో  ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా రోగులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జిల్లా వైద్య అధికారుల తీరుపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు .ప్రభుత్వ డాక్టర్లలో,వైద్యసేవల్లో మార్పు రాకుంటే మంత్రికి,జిల్లా కలెక్టర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, జిల్లా కార్యదర్శి నక్క రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

సంక్రాంతి శోభ

Satyam NEWS

ప్రగతి భవన్ కుక్క ఆకస్మిక మరణం

Satyam NEWS

ఈ సమయంలో స్వీయ గృహ నిర్బంధం ఒక్కటే పరిష్కారం

Satyam NEWS

Leave a Comment