42.2 C
Hyderabad
May 3, 2024 16: 45 PM
Slider మహబూబ్ నగర్

ఈ సమయంలో స్వీయ గృహ నిర్బంధం ఒక్కటే పరిష్కారం

malamahanadu

కరోనా వైరస్  బారిన పడకుండా స్వీయ గృహ నిర్బంధం విధించుకోవాలని మాల మహానాడు జాతీయ  అధ్యక్షుడు జి . చెన్నయ్య అన్నారు. చాలా దేశాలలో కరోనా 3వ , 4వ దశకు చేరుకోవడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారని, లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అన్నారు.

మానవ జాతి మనుగడ కోసం ప్రపంచం మొత్తం ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పెద్ద, చిన్నా,  తేడా  లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని పలు జాగ్రత్తలు తీసుకొని వైరస్ బారిన పడకుండా తమకు తమను స్వీయ రక్షించుకోవాలని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సూచనలను, సలహాలను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమష్టిగా పోరాడితే  కరోనా వైరస్ ను శాశ్వతంగా  భూస్థాపితం చేయవచ్చన్నారు. లాక్  డౌన్ ను పాటించాలని, ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. మన కోసం కృషి చేస్తున్న డాక్టర్లు , నర్సింగ్ సిబ్బంది , పోలీసులకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటామన్నారు.

Related posts

లోకేష్ ను చూస్తే జగన్ కు భయం

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డికి షాక్?

Satyam NEWS

తైక్వాండో విజేతలను అభినందించిన ములుగు అడిషనల్ డిసిపి సాయి చైతన్య

Satyam NEWS

Leave a Comment