29.7 C
Hyderabad
April 29, 2024 08: 15 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి శోభ

#PVSKrishnaKumariSankranti

మంచు దుప్పటి కప్పుకుని

మార్గశిర అందాలతో

ఏతెంచె ధనుర్మాసం

హరిదాసుల కీర్తనలు

ఆధ్యాత్మిక ను నింపె

ముంగిట రంగవల్లులు

రంగుల జీవితాన్ని

కనుల ముందుంచె

గొబ్బీయుల పాటలతో

పల్లెలన్ని పల్లవించె

పొట్టకూటికై పరుగులెట్టె

గంగిరెద్దుల  ఆటగాండ్రు

పంటచేతి కొచ్చె పండుగ

సంబరాలు మొదలాయె

కొత్త బియ్యపు పాయసం

నేతి అరిసెల ఘుమఘుమలతో

ఇల్లిల్లూ గుబాళించే

బంతిపూల తోరణాలు

కొత్త అల్లుళ్ళను స్వాగతించే

నింగికెగురుతున్న గాలిపటాలు

మనలోని ఆశలకు ప్రతీకలాయె

అద్దంపు చెక్కిళ్ళ పసిబాలల

భోగిపళ్ళు, బొమ్మల కొలువులు

కోడిపందేలతో

మకర రాశిలోకి సూర్యుడిని

ఆహ్వానిస్తూ మకరసంక్రాంతి

 సంబరాలు అంబరాన్నంటే

పి.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

Satyam NEWS

కాంగ్రెస్ లోకి జూపల్లి: బోగస్ ప్రచారంపై మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

దుర్గ పూజలో పాల్గొన్న నస్రత్ జహాన్

Satyam NEWS

Leave a Comment