40.2 C
Hyderabad
April 26, 2024 11: 13 AM
Slider ప్రపంచం

డోనాల్డ్ ట్రంప్ ఇక వైట్ హౌస్ ఖాళీ చేయాల్సిందే

#JoeBiden

జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో డోనాల్డ్ ట్రంప్ కన్నా స్వల్ప ఆధిక్యత సాధించడంతో డెమెక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠానికి మరింత చేరువ అయ్యారు.

పెన్సిల్వేనియాలోని 20 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించడంతో జో బైడెన్ కు మార్గం సుగమం అయింది. అదే విధంగా జార్జియాలోని 16 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు సాధించడంతో ఆయన కు ఆధిక్యత లభించినట్లయింది.

అదే విధంగా నెవెడా, అరిజోనా లో కూడా ఆధిక్యత కనిపిస్తుండటంతో ఇక ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

పరిస్థితి అర్ధం అయిన ట్రంప్ తాను కోర్టుకు వెళతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏ న్యాయస్థానానికి వెళ్లినా ఎన్నికల ఫలితాన్ని మార్చడం కుదరదు.

జార్జియా రాష్ట్రం ఫలితాలు వెలువడటంతో ఒక్క సారిగా ట్రంప్ జాతకం తిరగబడ్డది.

కరోనా వైరస్ భయం కారణంగా చాలా రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ఎంతో ఆలశ్యంగా సాగుతున్నది.

Related posts

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలి

Satyam NEWS

గవర్నర్ ఆహ్వానంతో రొట్టె విరిగి నేతిలో పడ్డ శివసేన

Satyam NEWS

Leave a Comment