హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేసిన అనంతరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాష్ట్ర ఐటి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందచేశారు.
అనంతరం ఎమ్మెల్యే గోపీనాథ్ కు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త వెలుగు నింపాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.