25.7 C
Hyderabad
May 9, 2024 10: 10 AM
Slider విజయనగరం

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పాము కాటుతో విద్యార్ధి మృతి

#dyCM

ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గ మైన కురుపాం బీసీ వసతి గృహంలో పాము కలకలం రేపింది. ఈ కలకలం లో హాస్టల్లో ముగ్గురు విద్యార్ధులను కాటేసిన వైనం చోటు చేసుకుంది. వెనువెంటనే సదరు విద్యార్ధులను సమీప హాస్పిటల్ కు తరలించారు. పెద్దాస్పటల్ కు తీసుకెళ్లాల్సిందేనని అక్కడి డాక్టరు చెప్పడంతో ఉన్న పళంగా విజయనగరం తిరుమల హాస్పిటల్ కు తరలించారు.

అయితే అక్కడే చికిత్స పొందుతూ రంజిత్ అనే విద్యార్థి మృతి చెందాడు. విషయం అందిన వెంటనే.. కురుపాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి..విజయనగరం తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను చూసి..అక్కడి డాక్టర్ల తో మాట్లాడి మైరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీలు డా.మహేష్ కుమార్ డిప్యూటీ సీఎం తో కలిసి తిరుమల హాస్పిటల్ ను సందర్శించారు.

అంతకుముందే కురుపం లో ఆ ముగ్గురు విద్యార్థులు వసతి గృహంలో పాము కాటుకు గురవ్వడంతో హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సకై చేర్పించారు. అందించారు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం తిరుమల కు తరలించారు.ముగ్గురు విద్యార్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.

మంతిని రంజిత్ దలాయిపేట కోమరాడ, 2. ఈదుబుల్లి వంశీ జీగారం సాలూరు,3. వంగపండు.నవీన్ జగ్గూనాయుడు పేట, చినబోగిలిలు.తాజా అందిన సమాచారం మేరకు ముగ్గురు విద్యార్థుల్లో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయినట్లు జాయింట్ కలెక్టర్ డా మహేష్ కుమార్ తెలిపారు. అలాగే ఓ విద్యార్థి వెంటిలెటర్ పై వున్నారని, మరో విద్యార్ధి ఆరోగ్యం నిలకడగా వున్నట్టు జె.సి. డా. మహేష్ కుమార్ తెలిపారు.

Related posts

అన్నవరం దేవస్థానం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

Satyam NEWS

ఎంపి అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న సీబీఐ

Satyam NEWS

క‌లెక్ట‌ర్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల సంఘం అవార్డు

Sub Editor

Leave a Comment