33.7 C
Hyderabad
April 28, 2024 23: 03 PM
Slider విజయనగరం

వేసవి లో కూడా తాగునీటి కొర‌త రానివ్వ‌కుండా చూస్తాం

మండే వేస‌విలోను తాగునీటి కొర‌త రానివ్వకుండా ప్ర‌జల దాహార్తిని తీరుస్తున్న ప్ర‌భుత్వం…మా జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మ‌ని విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే..మ‌రి కొద్ది గంట‌ల‌లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు చేపట్ట‌బోతున్న కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌ర శివారు…రామ‌తీర్ధం… నెల్లిమ‌ర్ల‌వ‌ద్ద ఉన్న వాట‌ర్ వ‌ర్క్స్ ను ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల ప‌రిశీలించారు.

అనంత‌రం నెల్లిమ‌ర్ల వ‌ద్ద‌…మ‌హరాణి అప్ప‌ల‌కొండ‌య్యంబ వాట‌ర్ వ‌ర్క్స్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. 2019ఏడాది మే నెలలో తాము అధికారం చేపట్టిన దగ్గరనుంచి మంచినీటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నామని అన్నారు. త్రాగు నీటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదని ఉద్దేశ్యంతో తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

2019 ఏడాదిలో తాము అధికారంలోకి వచ్చే సమయంలో ఐదు రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా అయ్యేది అని అన్నారు. తాము అధికారం చేపట్టిన తర్వాత రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సీఎం జ‌గ‌న్ , స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ సహకారం మరువలేనిదని అన్నారు. కొత్తగా గా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని ని దాస‌న్న‌పేట‌, గాజులరేగ, అయ్యన్నపేట తదితర ప్రాంతాలులో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించు కోవడం కూడా జరిగిందన్నారు.

మరో పదిహేను రోజుల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మితమైన వాటర్ ట్యాంక్ ప్రారంభించనున్నామని తెలిపారు. ధర్మపురి, కె ఎల్ పురం , అయ్యన్నపేట ప్రాంతాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు. బీసీ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, వైయస్సార్ నగర్ ప్రాంతాలలో త్వరలోనే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని అన్నారు.

ఈ పర్యటనలో నగర మేయర్ వెంపడా పు విజయలక్ష్మి, నగర డిప్యూటీ మేయర్ లు కోలగట్ల శ్రావణి, ఇసరపూ రేవతి దేవి, పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆశపూ వేణు, పార్టీ జోనల్ ఇంచార్జ్ యస్.వి.వి.రాజేష్, డాక్టర్ వి ఎస్ ప్రసాద్, జి ఈశ్వర్ కౌశిక్,రెడ్డి గురుమూర్తి, కార్పొరేటర్లు కడియాల రామకృష్ణ, సుంకర బాబు, పట్నాన పైడిరాజు, మారోజు శ్రీనివాసరావు, భవి రెడ్డి సతీష్, వింత ప్రభాకర్ రెడ్డి, నడిపల్లి ఆదినారాయణ, ఎన్ని లక్ష్మణరావు, మహిళా కార్పొరేటర్లు ఆశ పు సుజాత, బొనెల ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, దాసరి సత్యవతి, తోగరోతు సంధ్యారాణి, పార్టీ నాయకులు యవర్ణ కుమారస్వామి, పిన్నింటి సూర్యనారాయణ, కనుగుల రాజా, తాళ్లపూడి పండు, బొడ్డురు లక్ష్మణరావు, నాయని మహేష్, నగరపాలక డి ఈ లు మణికుమార్,అప్పారావు, ఏఈ శ్రీనివాసరావు , తదితరులు ఉన్నారు.

Related posts

ఫిషింగ్ హార్బర్ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

Satyam NEWS

వీరభద్రీయులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Satyam NEWS

సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment