42.2 C
Hyderabad
April 30, 2024 17: 32 PM
Slider విజయనగరం

కరోనా కేసులు తగ్గించాలంటే లాక్ డౌన్ మరింత కఠినతరం

#Vijayanagaram lock down

సెకండ్ వేవ్ క‌రోనా క‌ట్ట‌డికి రెవిన్యూ, వైద్య శాఖ‌ల‌తో పాటు పోలీసులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట ప‌డుతునే ఉన్నారు. ఎవ‌రికి వారేఈ క‌రోనా వైర‌స్ నాకు,నా కుటుంబ‌స‌భ్యుల‌కు రాకూడ‌ద‌ని అనుకుని  పోలీసులు చెప్పిన విధంగా నాల్గింటిని క‌చ్చితంగా పాటిస్తారో వాళ్ల‌కే క‌రోనా రాద‌ని నిపుణులుసైతం పేర్కొంటున్నారు. అయితే తాజాగా జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో  మ‌రోసారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి పోలీసులు చ‌ర్య‌లు ప్రారంభించారు.

బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో కూరగాయ‌లు అమ్మ‌డం  త‌ద్వారా వైర‌స్ మ‌రింత వ్యాప్తి చంద‌డంతో పాటు జ‌నాలు కూడ  గుంపులు,గుంపులు గా  ఉండ‌టంతో   పోలీసులు మ‌రోసారి దాన్ని అరిక‌ట్టేందుకు దృష్టిసారించారు. ఇందులోభాగంగా న్యూపూర్ణ ,కోడిరామ్మూర్తి పార్క్ వ‌ద్ద బహిరంగంగా రోడ్ల‌పైనే అమ్మ‌తున్న కూర‌గాయ‌ల వ‌ర్త‌కుల‌ను మళ్లీ గ‌తేడాది మాదిరిగానే పాత‌బ‌స్టాండ్ వ‌ద్ద రాజీవ్ క్రీడా ప్రాంగణం వ‌ద్ద‌కు త‌ర‌లించారు.

దీంతో పొద్దున్నే అక్క‌డే ఉదయం నుంచీ కేవ‌లం వ్యాపారుల హాడావుడి క‌నిపించింది. క్రీడా ప్రాంగ‌ణంలో ఎడ‌వైపు మామిడి కాయ‌లు,కుడివైపు కూర‌గాయ‌లు అమ్ముకునే విధంగా మున్సిప‌ల్,రెవిన్యూ,మార్కెటింగ్ శాఖ‌లు నిర్ణ‌యించాయి.

ఈ నెల 21 నుంచీ అని చెప్పినా…22 వ తేదీ నుంచీ క్రీడా ప్రాంగ‌ణంలోకి కూర‌గాయ‌ల వర్త‌కులు రావ‌డం ప్రారంభించారు.దీంతో  మ‌రోసారి ప్ర‌తీ ఒక్కరూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా…మాస్క్ లు పెట్టుకోకుండా ఉండ‌టం కంట‌క‌నిపించింది.

క‌రోనా క‌ట్ట‌డికి డీఎస్పీ తో స‌హా రంగంలోకి సీఐలు….!

క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఒక్క రోజులో దాదాపున 967 కేసులు న‌మోదవడంతో ఆ సంఖ్య‌ను త‌గ్గించేందుకు పోలీసులు కంటిమీద కునుకు లేకుండా  రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోనూ ఉన్న మూడు రైతు బ‌జార్ల‌తో పాటు పాత బ‌స్టాండ్ రాజీవ్ క్రీడా ప్రాంగ‌ణంలోకూడా కూర‌గాయ‌లు అమ్ముకునే లా పోలీసులు ద‌గ్గ‌రుండీ అటు మున్సిప‌ల్ అధికారులు,ఇటు మార్కెటింగ్ శాఖ‌ల‌తో మాట్లాడి స్థ‌ల మార్పులు చేయ‌సాగారు.

ఇందులో|భాగంగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద ఉన్న రైతు బ‌జార్ లో కూర‌గాయ‌లు అమ్మే వారినంద‌రినీ ఎదురుగా ఉండే పాత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద‌కు త‌ర‌లించారు.అలాగే కోడి  రామ్మూర్తి వ్యాయామ క‌ళాశాల  వ‌ద్ద కూర‌గాయ‌లు అమ్మ‌తున్న వారిని మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌లోనే రాజీవ్ క్రీడా ప్రాంగ‌ణం  వ‌ద్ద‌కు త‌ర‌లించారు.

ఈ నేప‌ధ్యంలో ఆయా ప్రాంతాల‌లో ఉన్న ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని డీఎస్పీ అనిల్ తో స‌హా వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ ద‌గ్గ‌రుండీ పరిశీలించారు.

పాత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద అమ్ముతున్న వారిని డీఎస్పీ అనిల్ …కుశ‌ల ప్ర‌శ్న‌ల‌తో పాటు ఎక్క‌డుంటే మీకు ఫ్రీ గా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. వారంతా విశాలంగా ఇక్క‌డే ఇరుకు లేకుండా కూరగాయ‌లు అమ్ముతున్నామ‌ని చెప్పారు.

అక్క‌డ ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌కుండా..కొనుగోలు దారుల‌కు అమ్మేవారికి మ‌ధ్య వార‌ధిలో మ‌హిళా సంర‌క్ష‌ణ పోలీసుల‌కు కూడా పెట్టించింది…పోలీసు శాఖ . ఈ మేర‌కు వాళ్ల విధుల‌ను కూడా డీఎస్పీ అనిల్ అడిగి తెలుసుకున్నారు. ఇక్క‌డే దాదాపు 5  మంది ఎంఎస్పీలు ప‌ని చేస్తున్నార‌ని వ‌న్ టౌన సీఐ ముర‌ళీ చెప్పారు.

Related posts

2024లో మళ్లీ మేమే గెలుస్తాం

Satyam NEWS

పెట్రోలు,డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకోవాలి

Satyam NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

Satyam NEWS

Leave a Comment