33.7 C
Hyderabad
April 29, 2024 01: 29 AM
Slider ఆంధ్రప్రదేశ్

15 నుంచి 22 వ‌ర‌కు మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు

DGP

జాతీయ స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలను ఈ నెల 15 నుండి 22 వరకు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతం స‌వాంగ్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ఆయ‌న‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి యాంటీ డ్రగ్స్ వారోత్సవాల నిర్వహణపై రాష్ట్రంలో పని చేస్తున్నఅన్నిజిల్లాల ఎస్పీలు, డీఐజీలు, ఎస్ఈబి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలు ఏవిధంగా హాని కలిగిస్తుందో ప్రజలకు వివరించేందకు అవగాహన సదస్సులను చేపట్టాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అదీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా గంజాయి దేశంలోని ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా జరుగుతున్నవిషయాలపై ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా ఎ ఈ బి విభాగాన్ని ఏర్పాటు చేసామన్నారు. ఎప్పటికప్పుడు ఎస్ బి అధికారులు మాదక ద్రవ్యాల నియంత్రణకు ఆకస్మికంగా చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మనుషులను, గ్రూపులను ముందుగా గుర్తించి, చర్యలు చేపట్టడం వలన మాదక ద్రవ్యాల నియంత్రణ చేయవచ్చునన్నారు.

అనంతరం, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ డా. ఎ.రవిశంకర్ యాంటీ డ్రగ్ డ్రైవ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 22 వరకు జిల్లాలో యాంటీ డ్రగ్స్ డ్రైవ్ ను నిర్వహించి, అనధికారంగా మాదక ద్రవ్యాలు కలిగిన వారి పైనా, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయల్సిందిగా జిల్లా ఎస్పీ రాజకుమారి తన శాఖా సిబ్బంది ని ఆదేశించారు. అంతేకాకుండా, జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా దాడులు నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. ఇందుకోసం, ఎ.ఈ.బి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వివరాలను ఎప్పటికప్పుడు ప్రత్యేక విభాగానికి తెలియపర్చాలని జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, స్నిపర్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

బాలికా విద్య ప్రగతికి కృషి చేస్తున్న మాపై ఇంత చిన్న చూపా

Satyam NEWS

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా టీ.శ్రీనివాసరావు

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment