38.2 C
Hyderabad
April 29, 2024 12: 17 PM
Slider శ్రీకాకుళం

బాలికా విద్య ప్రగతికి కృషి చేస్తున్న మాపై ఇంత చిన్న చూపా

#kasuribaschool

ప్రభుత్వ కొలువు దొరికితే జీవితానికి భద్రత లభిస్తుందని గంపెడాశ తో కస్తూరీ బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధుల్లో చేరిన పలువురు అష్టకష్టాలు పడుతున్నారు. పేరుకే పార్ట్ టైమ్ కొలువని చెప్పి విధులు మాత్రం పుల్ టైమ్ పద్దతి లోనే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని కే.జి. బీ.వి.లో.   బీ.ఈడి. ఎం .ఈడి ,పీ. జీ. , పి హెచ్. డి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అన్ని  విద్యార్హత తో పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధుల్లో చేరిన తమకు న్యాయం జరగడం లేదని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

2018 లో  క్యాష్ టు, రోస్టర్, మెరిట్ , కలెక్టర్  ఇంటర్వ్యూ ద్వారా నియామకం పొందామనీ, అయినా..నేటికీ తమకు ఉద్యోగ భద్రత విషయమై అతి, గతీ లేదనీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్తూరీ బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో 85నుంచీ 90.శాతం  వరకూ మెరుగైన ఉత్తీర్ణత సాధనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్పటికీ నేటికీ వేతనం 12,000వేలు మాత్రమే నని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 

అధ్యాపకులుగా విధుల్లో చేరిన  తామంతా కే.జి. బీ.వి.ల్లో విద్యాబోధన తో పాటు వార్డెన్,నైట్ వాచ్ మెన్,కేర్  టేకర్, వంటి అదనపు విధులు తో పాటు కౌమార దశలో బాలికలకు తలెత్తే ఆనేక ఆరోగ్య సమస్యల పై అవగాహన,చైతన్య కల్పించి వారి ఆరోగ్య పరిరక్షణకు సైతం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇలా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం దిశగా  విద్యా బోధన తో పాటు పలు అదనపు విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ వారు ప్రభుత్వాన్ని కో రుతున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్   దీటుగా ఇంగ్లీష్ మీడియం తో విద్యాబోధన చేస్తున్న తమను ప్రభుత్వం అన్నీ విధాల ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా తమ సర్వీసులు రెగ్యులర్ చేయాలని,ప్రభుత్వ ఉద్యోగుల కు కల్పిస్తున్న అన్నీ సదుపాయాలు వర్తింపచేసి రూ.57 వేల రూపాయల వేతనం చెల్లించాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అధ్యాపకులకు రూ.57 వేల రూపాయల వేతనం చెల్లిస్తుండగా కస్తూరి బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్ టైమ్ గా పుల్ టైమ్ విధులు నిర్వహిస్తున్న మాకు కేవలం రూ.12 వేల రూపాయల వేతనం నేటికీ చెల్లిస్తూ శ్రమ దోపిడీ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ భద్రత,57 వేల రూపాయల వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కూర్చున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి,ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాసర్వశిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ కు, శ్రీకాకుళం జిల్లా కలక్టర్ కు వినతిపత్రాలు అందచేసామని తెలిపారు.

Related posts

త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఆవిష్కృతం?

Satyam NEWS

విద్యుత్ కార్మికుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు

Satyam NEWS

‘కోనాపురం లో జరిగిన కథ’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam NEWS

Leave a Comment