40.2 C
Hyderabad
April 29, 2024 16: 21 PM
Slider నల్గొండ

వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ని బదిలీ చేయండి

#hujurnagar

సుమారు ఒక సంవత్సర కాలంగా వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు ఎంత వసూలు చేస్తున్నాడో తెలియని పరిస్థితి దాపురించిందని,మసీదులో ఉన్న సమస్యలపై ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడని,మసీద్ కమిటీకి కానీ ముస్లిమ్స్ కూడా ఇతను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండకుండా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని,ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎండి.అజీజ్ పాషా అన్నారు.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.మసీద్ కాంప్లెక్స్ దుకాణాల కిరాయిలు ఎంత వసూలు చేస్తున్నాడో డిస్ప్లేనోటీస్ బోర్డు ద్వారా  ముస్లింలకు తెలియపరచడం లేదని, నాలుగు నెలలుగా సిబ్బందికి జీతభత్యాలు రావడం లేదని,మసీదులో నమాజ్ చదవడానికి మైకులు సక్రమంగా పనిచేయడం లేదని,కొత్తవి కావాలన్నా తెప్పించటం లేదని అన్నారు.

మసీదు క్లీన్ చేసే స్కావెంజర్ కు కూడా జీతం ఇవ్వటం లేదని,హుజూర్ నగర్ ఉస్మానియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు ప్రతినెల జిల్లా వక్స్ బోర్డ్  ఇన్స్పెక్టర్ మహమూద్ వసూలు చేసుకుని వెళ్తున్నారని,కానీ ప్రతి షాప్ కి ఎంత కిరాయి వసూలు చేస్తున్నాడో కూడా చెప్పటం లేదని అజీజ్ పాషా అన్నారు.

ఉస్మానియా మసీద్ లో బోర్డుపై కిరాయిల పట్టిక డిస్ప్లేచేయాలని,ముస్లిం లకు తెలియపరచాలని పలుమార్లు ఇన్స్పెక్టర్ ను కోరినా కిరాయిల జాబితాను ప్రజలకు ఎందుకు తెలియపరచడం లేదని ప్రశ్నించారు.రహస్యంగా అద్దెలు వసూలు చేస్తున్నాడని,దీని వెనకాల దాగిఉన్న మతలబు ఏమిటి అనే ప్రశ్నలు ముస్లిం సోదరులు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో పోరాట ఫలితం తోటి మసీద్ కాంప్లెక్స్ లో కిరాయిలు పెరిగాయని, కిరాయలే వసూలు చేస్తున్నాడా లేదా తగ్గించి వసూలు చేస్తున్నాడో అర్థం కావడం లేదని,పలుమార్లు కిరాయిలు ఎంత వసూలు చేస్తున్నారు చెప్పమని అడిగినా జవాబు దాటేస్తున్నాడని, దుకాణాల కిరాయిలు ప్రతినెల వేల రూపాయలు వసూలు చేసుకుని తీసుకొని వెళ్తున్నాడు కానీ మసీదు అభివృద్ధికి మాత్రం ఆటంకం కలిగిస్తున్నాడని మహ్మద్ అజీజ్ పాషా అన్నారు.

మసీదులో నమాజ్ చదివించడానికి మైకులు సక్రమంగా పనిచేయడం లేదని,వాటి స్థానంలో కొత్త మైకులు తీసుకురావాలని పలుమార్లు ఇన్స్పెక్టర్ కి చెప్పినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని, దీనివల్ల నమాజ్ చేసేటప్పుడు ముస్లిం సోదరులకు మైకు సక్రమంగా రాకపోవడంతో ప్రార్థనల్లో ఆటంకం కలుగుతుందని,మసీదులలో పనిచేసే సిబ్బందికి గత నాలుగు నెలల నుండి వేతనాలు రాక కుటుంబ పోషణ కష్టంగా ఉందని,మసీదులో శుభ్రం చేసే స్కావెంజర్ కి జీతాలు ఇవ్వకపోవడంతో స్కావెంజర్లు శుభ్రం చేయడానికి రావడం లేదని,మసీదు అభివృద్ధికి చెందవలసిన కిరాయి డబ్బులు మసీదు అభివృద్ధికి జీతభత్యాలకు ఖర్చు పెట్టకుండా ఇన్స్పెక్టర్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని అజీజ్ పాషా అన్నారు.

ఇన్స్పెక్టర్ బాధ్యతలు తీసుకొని సుమారు 3 సంవత్సరాలు అవుతుందని,అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక వివాదాలను సృష్టిస్తున్నాడని,గతంలో ఇతను చేసిన అవకతవకలపై,అవినీతిపై కూడా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని,ఇతని వల్ల కొత్త వివాదాలకు ఆద్యం పోస్తున్నాడని,మసీదు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడని తక్షణమే గతం నుండి ఇతని వ్యవహార శైలిని పరిశీలించి వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ని బదిలీ చేయాలని ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేస్తూ ఆర్టీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ కి ముస్లిం సోదరులు కలసి కట్టుగా వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీల నాయకులు మహమ్మద్ గౌస్ ఖాన్,ఎండి సిరాజ్,ఎస్.కె.మజీద్,డ్రైవర్ ముస్తఫా,ఎండి అలావుద్దీన్,షేక్ దస్తగిరి,భాష,ఎస్.కే.మీరా, మక్సుద్ మౌలానా,గౌస్ భాయ్, షేక్ మోయిన్, సలీం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

అభివృద్ధి నిరోధకుడు సీఎం జగన్

Satyam NEWS

పోస్టుపోన్: శ్రీవారి భక్తులకు పాక్షిక విజయం

Satyam NEWS

స్వాత్ లోయలో మళ్లీ పెరుగుతున్న ఉగ్రవాదం

Satyam NEWS

Leave a Comment