32.2 C
Hyderabad
May 2, 2024 00: 37 AM
Slider జాతీయం

డ్రంకెన్ గరల్స్:తాగారు తూలారు సస్పెండ్ అయ్యారు

college

వాళ్లు కాలేజీ పిల్లలు. యూనిఫారంలోనే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి మందుకొట్టారు. పుట్టినరోజు వేడుకల బాయ్ ఫ్రండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశారు. ఇదంతా వారు వీడియో కూడా తీసుకున్నారు. తమిళనాడులోని నాగపట్నం లో ఈ సంఘటన జరిగింది. వారు చదివే కళాశాల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయిలాదుత్తురై అనే గ్రామంలో ఈ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

ఆరు వారాల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోలో కళాశాల యూనిఫాంలో ముగ్గురు బాలికలు, సాదా దుస్తులలో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఒక అబ్బాయి వారితో కలిసి తాగుతున్నాడు. ఈ వీడియో బయటకు రావడంతో ధర్మపురం ఆర్ట్ కాలేజీ యాజమాన్యం ఒక్క సారిగా నోరు వెళ్లబెట్టింది. వీరంతా అండర్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం విద్యార్ధులుగా గుర్తించారు.

అబ్బాయితో కలిసి పార్టీలో మద్యం సేవించినందుకు నలుగురు బాలికలను కాలేజి నుంచి బహిష్కరించారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులు పార్టీని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నాడు. కళాశాల అనేది పిల్లల మంచి కోసం కొన్ని విలువలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ చెప్పారు.

కఠినమైన శిక్ష విధించకపోతే, అది ఇతర విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ కళాశాల భారతీ దాసన్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. భారతీ దాసన్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ స్పందిస్తూ ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.

Related posts

రిటర్న్ గిఫ్ట్: రాజధాని మార్పు వ్యూహకర్త ఎవరు?

Satyam NEWS

కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

Bhavani

జమ్మూ కాశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ రాజీనామా

Satyam NEWS

Leave a Comment